బుట్టబొమ్మ లా బంతాడే అందంతో!
పాల నురుగుల సౌందర్యం పై చిలకాకు పచ్చ రంగు డిజైన్ గౌన్ లో సారా అలా మెరిసే సరికి ఆ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది.
చురకత్తితో గుచ్చితో గుండెలోతుల్లోకి దిగాల్సిందే. చురకత్తి పదును అలాంటింది. మరి అందం అనే చురకత్తితో గుచ్చితే! ఆ గాయం పోటు ఇంకెంత లోతుగా వెళ్తుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా పటౌడీ వారసుడు సారా అలీఖాన్ అలాంటి పోటుకే కుర్రాకారుని గురి చేస్తుంది. ఇదిగో అమ్మడిలా అందంగా ముస్తాబైన వనమే అందుకు దారి తీసింది.
పాల నురుగుల సౌందర్యం పై చిలకాకు పచ్చ రంగు డిజైన్ గౌన్ లో సారా అలా మెరిసే సరికి ఆ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలవు అనిపిస్తుంది. బుట్ట డిజైన్ గౌనులో అమ్మడు అచ్చంగా బుట్టబొమ్మనే తలపించింది. శ్వేత వర్ణం స్కిన్ టోన్ పై ఆ రంగు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందులోనూ సారా ధరించే సరికి ఆ దుస్తులకు కొత్త అందమే జత అయింది. ఇక అమ్మడు ఎంపిక చేసుకున్న యాక్సర సీస్ ..మ్యాకప్ ప్రతీది మరింత అందంగా తీర్చి దిద్దాయి.
వేలికి పొడితో కూడిన రింగ్..చెవులకు పెట్టిన దిద్దులు అన్ని సారాని మరింత అందగా మార్చేసాయి. అమ్మడు అలా ముఖం 30 డిగ్రీల కోణం తిప్ప కెమారాకి ఫోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జా లంలో వైరల్ గా మారింది. సారా అభిమానులు అమ్మడి అందాన్ని ఆకాశానికి ఎత్తకుండా ఉండలేకపోతు న్నారు. లుక్స్ గార్జియస్...బ్యూటీఫుల్ లేడీ అంటూ తమదైన శైలిలో కామెంట్ల వర్షం గుప్పిస్తున్నారు.
ఇక సారా కెరీర్ సంగతి చూస్తే బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'గ్యాస్ లైట్'..'జర్ హట్ కే జర బచ్ కే'..'యే వతన్ మేరా వతన్' లాంటి విజయాలతో రెట్టింపు ఉత్సాహంలో ఉంది. ప్రస్తుతం అమ్మడి ఖాతాలో హిందీలోనే ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. అవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అవి గాక కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నాయి. నటిగా డే బైడే షైన్ అవుతుంది.