బ్యాంక్ వేలానికి సీనియర్ హీరో ఇల్లు
అయితే సినీరంగంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అప్పులపాలయ్యేవారికి కొదవేమీ లేదు. తమ ఆస్తులను, జీవితాలను పణంగా పెట్టి సినిమా కోసం త్యాగాలు చేస్తుంటారు.
కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా అంతటి వాడే అప్పుల బాధ పడలేక సొంత ఇల్లు, ఆస్తుల్ని వదిలి విదేశాల్లో తలదాచుకున్నారు. సంస్థ అప్పులతో దివాళా తీయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వ్యాపారంలో ఒడిదుడుకులు, ఘరానా మోసం అంటూ అతడిపై చాలా ప్రచారం సాగింది. అయితే సినీరంగంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అప్పులపాలయ్యేవారికి కొదవేమీ లేదు. తమ ఆస్తులను, జీవితాలను పణంగా పెట్టి సినిమా కోసం త్యాగాలు చేస్తుంటారు. అలాంటి ఒక త్యాగం ప్రముఖ హీరోని ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పుడు అతడి ఇంటిని బ్యాంక్ అధికారులు వేలం వేయడానికి సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
సీనియర్ హీరో తన ఆస్తిని తణఖా పెట్టి రుణం పొందారు. దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. చాలా కాలం పాటు వేచి చూసిన బ్యాంకులు మొండి బకాయిని వసూలు చేయలేని స్థితిలో ఇప్పుడు ఇంటిని వేలం వేసేందుకు రెడీ అయ్యారని తెలిసింది. ప్రస్తుతం ఈ వేలంపై ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్యాంకు అధికారులు ఆస్తిని వేలం వేయడానికి ముందు.. దానిని కాపాడుకునేందుకు సదరు హీరో తనవంతు ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.
ఈ ఇంటిని నిలబెట్టుకునేందుకు అతడు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిజానికి టాలీవుడ్ లో స్థిరపడిన వారికి ఫిలింనగర్ అత్యంత అనుకూలమైన ప్లేస్. ఇలాంటి చోట నివాసం చాలా హాయిగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఫిలింనగర్ లో గజం ధర చుక్కల్ని తాకుతోంది. అలాంటి చోట ఇంటిని కోల్పోవడం అంత మంచిది కాదు. ఇక ఇలాంటి చోట ఖరీదైన ఇల్లు వేలానికి వచ్చింది అంటే దానిపై చాలా మంది బడాబాబుల కన్ను ఉంటుంది. బ్యాంక్ వేలం వేసే లోపు ఆ హీరో ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ప్రముఖ వ్యక్తి కాబట్టి అతడికి మరో చోట రుణం పుట్టడం కూడా సమస్య కాకపోవచ్చు. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. వేలం వరకూ వస్తే, ఏం జరుగుతుందో వేచి చూడాలి.