జూన్ నుంచి బాద్ షా రంగంలోకి!
కోల్ కత్తా ఆడే ప్రతీ మ్యాచ్ కి వస్తానని ప్రామిస్ చేయడంతో షారుక్ అదే పనిలో ఉన్నాడు.
బాద్ షా షారుక్ ఖాన్ గతేడాది వరుస విజయలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. 'పఠాన్'..'జవాన్' చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో షారుక్ రెట్టించిన ఉత్సాహంలో కనిపించాడు. అటుపై రిలీజ్ అయిన `డంకీ` కాస్త నిరాశ పరిచినా రెండు భారీ విజయాలు ముందుండటంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అటుపై కొంత గ్యాప్ అనంతరం షారుక్ ఐపీఎల్ బిజీ అయ్యారు. కోల్ కత్తా ఆడే ప్రతీ మ్యాచ్ కి వస్తానని ప్రామిస్ చేయడంతో షారుక్ అదే పనిలో ఉన్నాడు. ఈనెలతో ఐపీఎల్ కూడా పూర్తవుతుంది.
దీంతో షారుక్ జూన్ నుంచి కొత్త సినిమా షూటింగ్ కూడా షురూ చేయబోతున్నట్లు చెప్పేసారు. `డంకీ` రిలీజ్ తర్వాత కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు? అని అభిమానులు ఐదు నెలలుగా వెయిట్ చేస్తున్నారు. ఇంత కాలానికి దానిపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఇది కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి నటించే సినిమా అని తెలుస్తోంది. ఇందులో షారుక్ గురువు పాత్రలో కనిపించనున్నాడు. తొలుత గెస్ట్ రోల్ అని తెరపైకి వచ్చింది గానీ..అటుపై దర్శకుడి కోరిక మేరకు షారుక్ నిర్ణయం మార్చుకుని..తన స్టార్ డమ్ ని పక్కనబెట్టి కుమార్తె కోసం గురువు అవతారం ఎత్తుతున్నాడు.
సుహానా ఖాన్ `ది అర్చిస్` తో లాంచ్ అయినా హీరోయిన్ గా మాత్రం డెబ్యూ చిత్రం కింగ్ అవుతుంది. ఈ సినిమా ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలు పెడుతున్నారు. అయితే ఇంత గ్యాప్ తీసుకోవడానికి షారుక్ ఓ రీజన్ రివీల్ చేసారు. మూడు సినిమాల కారణంగా బాగా అలసిపోయినట్లు తెలిపారు. అందుకే విరామం కోసం నెలలు సమయం కేటాయించాల్సి వచ్చిందన్నారు.
దీంతో పాటు ఐపీఎల్ కూడా మరో కారణంగా తెలిపారు. ఇప్పుడన్నీ సర్దుకోవడంతో షారుక్ ఖాన్ షూటింగ్ కి రెడీ అవు తున్నట్లు తెలిపారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి హీరోగా కొత్త సినిమా స్టార్ట్ చేసేదెప్పుడు? అని అభిమానులు అడుగుతున్నారు. కుమార్తె సినిమాలో కేవలం గురువు పాత్ర మాత్రమే. అందులో షారుక్ నుంచి భారీ యాక్షన్ సన్నివేశాలు ఎక్స్ పెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి షారుక్ హీరోగా మ్యాకప్ వేసేదెప్పుడు? అంటూ అడుగుతున్నారు. షారుక్ దీనికి అన్సర్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన హీరోగా సినిమా చేయడం అంటే చాలా గ్రౌండ్ వర్క్ చేసి కమిట్ అవుతారు. అది ఇప్పటి నుంచి మొదలు పెడితే వచ్చే ఏడాదికి పూర్తవుతుంది.