స్వీమ్ షూట్ లో పాండే బ్యూటీ ఘాటు ఫోజు!

ఇక అమ్మ‌డి సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు సినిమాలతో సంబంధం లేకుండా ఇన్ స్టాలో మాత్రం హీటెక్కిస్తుంది.

Update: 2024-10-10 17:30 GMT

`అర్జున్ రెడ్డి` హిట్ తో తారాజువ్వ‌లా దూసుకొచ్చిన షాలినీ పాండే జాడిప్పుడు టాలీవుడ్ లో ఎక్క‌డా క‌నిపించ‌ని సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల క్రితం `నిశ‌బ్దం` సినిమాలో క‌నిపించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అమ్మ‌డు ప‌త్తా లేదు. బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది గానీ అక్క‌డా స‌రైన స‌క్సెస్ రాలేదు. ఇటీవ‌లే రెండేళ్ల గ్యాప్ అనంత‌రం `మ‌హారాజ్` సినిమా చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లేదు.


కొత్త అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. కానీ స్టార్ కిడ్స్ వేవ్ కార‌ణంగానూ కొన్ని అవ‌కాశాలు కోల్పోతుంది. ఆ మ‌ధ్య షాలిని పాండే న‌టించాల్సిన సినిమా అన్య‌న్యా పాండే త‌న్నుకుపోయింది. ట్యాలెంట్ ఉన్నా? ఆ ర‌కంగా కొన్ని అవ‌కాశాలు కోల్పోతుంద‌నే ప్ర‌చారం ఉంది. ఇక అమ్మ‌డి సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా ఇన్ స్టాలో మాత్రం హీటెక్కిస్తుంది.

హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో నాకెవ్వ‌రూ సాటి అంటూ పోటీ పడుతుంది. తాజాగా సొగ‌స‌రి మ‌రో హాట్ భంగిమ‌తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా అమ్మ‌డు స్విమ్ షూట్ సెల్పీ ఘాటు ఫోజుతో కిర్రెక్కిస్తుంది. అమ్మ‌డు మునుప‌టి కంటే స‌న్న‌జాజిలా మారింది. రూప లావ‌ణ్యంలో చాలా మార్పులు తెచ్చింది.

ఫేస్ టూ థైస్ లో ఎన్నో ఛెంజెస్ క‌నిపిస్తున్నాయి. టోన్డ్ బాడీ ఫోక‌స్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి అభిమానులు ఎవ‌రిస్టైల్లో వారు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కెరీర్ ప‌రంగా కొత్త అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది కానీ ఫ‌లించ‌డం లేదు.

Tags:    

Similar News