శంకర్ నెక్స్ట్ ఏంటి? ఆ స్టార్ హీరో ఛాన్స్ ఇస్తాడా?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం చేంజ్ అయింది.

Update: 2025-02-27 07:30 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఉన్న క్రేజే వేరు. ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం చేంజ్ అయింది. ఆయన తీసిన గత రెండు సినిమాలు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

శంకర్ స్క్రీన్ ప్లే, పేలవమైన స్టోరీల పట్ల భారీ ట్రోల్స్ వచ్చాయి. అయితే శంకర్ నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేతిలో ఇప్పుడు ఇండియన్-3 ఉంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తైనా.. ఆ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

సినిమా నుంచి లైకా ప్రొడక్షన్స్ తప్పుకుందని.. కేవలం ఇప్పుడు రెడ్ జెయింట్ పిక్చర్స్ టేకోవర్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇండియన్ -2 వల్ల భారీగా నష్టాలు రావడంతో ఆ నిర్ణయం లైకా సంస్థ తీసుకుందని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని రెడ్ జెయింట్ చూస్తుందట.

అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్ల సమయంలో శంకర్ తన తదుపరి చిత్రం వేల్పూరి నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించారు. కానీ ఎవరితో అన్నది చెప్పలేదు. ఇప్పుడు తన కొత్త మూవీ.. వేల్పూరి నవల ఆధారంగా స్టార్ హీరో అజిత్ తో వర్క్ చేయాలని శంకర్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కానీ దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం అజిత్.. ఫారిన్ లో ఉన్న విషయం తెలిసిందే. స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. దీంతో ఆయన ఇండియా వచ్చాక.. చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే శంకర్ కు అజిత్ అవకాశం ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

రీసెంట్ గా అజిత్.. పట్టుదల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచారు. త్వరలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో రానున్నారు. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రానున్న ఆ మూవీతో హిట్ కొడతారని ఆశిస్తున్నారు. మరి అజిత్.. ఇప్పుడు శంకర్ కు ఛాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News