గేమ్ చేంజర్ సీక్వెల్.. శంకర్ ఏమన్నారంటే..

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నారు.

Update: 2024-07-02 10:30 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి సినిమాకి కచ్చితంగా సీక్వెల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సీక్వెల్స్ ట్రెండ్ టాలీవుడ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. పార్ట్ 1 హిట్ అయితే ఆటోమేటిక్ గా సీక్వెల్ మీద హైప్ పెరుగుతుంది. తద్వారా బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని స్టార్ హీరోలు సీక్వెల్ అవకాశాలు ఉండే కథలకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అలాగే దర్శకులు తాము రాసుకున్న కథలకి కచ్చితంగా సీక్వెల్స్ ఉండేలా లీడ్ పాయింట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా వర్క్ అవుట్ అయితే పార్ట్ 2 చేయాలని ముందుగానే డిసైడ్ అయిపోతున్నారు. ఫ్లాప్ అయితే మాత్రం ఇక పార్ట్ 2 ఆలోచన చేయడం లేదు. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని జక్కన్న ఇప్పటికే ప్రకటించారు.

దాని తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 ప్రమోషన్స్ లో డైరెక్టర్ శంకర్ ని గేమ్ చేంజర్ ర్ మూవీ గురించి కూడా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీకి ఏమైనా పార్ట్ 2 ప్లానింగ్ ఉందా అని మీడియా మీట్ లో శంకర్ ని అడిగారు.

Read more!

గేమ్ చేంజర్ మూవీకి సీక్వెల్ లేదని, ఒక మూవీకి సరిపడే కథ ఉందని తెలిపారు. ఆ చిత్రానికి ఇక సీక్వెల్ చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. గేమ్ చేంజర్ కి పెర్ఫెక్ట్ స్టోరీ సెట్ అయ్యిందని తెలిపారు. మూవీలో రామ్ చరణ్ పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని శంకర్ తెలిపారు. అయితే ఈ సినిమా రిలీజ్ పైన మాత్రం శంకర్ ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇంకా 15 రోజుల షూటింగ్ ఉందని మాత్రం చెప్పారు.

చరణ్ కూడా వీలైనంత వేగంగా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని RC16 కోసం రెడీ అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ మీద పట్టుసాధించే ప్రయత్నం చరణ్ చేస్తున్నారు. అలాగే లుక్ పరంగా కూడా చేంజ్ కాబోతున్నారు. అయితే బుచ్చిబాబు సానా ఈ సినిమాకి రెండు భాగాలుగా చేసే అవకాశం ఉందంట.

Tags:    

Similar News

eac