శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.. ఎలా ఉండబోతున్నాయి?

రోబోకి సీక్వెల్ గా చేసిన 2.0 బడ్జెట్ పెరిగిపోవడంతో భారీ కలెక్షన్స్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అందుకోలేదు.

Update: 2024-07-02 11:30 GMT

సౌత్ ఇండియా నుంచి రాజమౌళి కంటే ముందుగానే పాన్ ఇండియా లెవల్ లో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం. జెంటిల్మన్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టిన శంకర్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా 10 సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఆ తరువాత 3 ఇడియట్స్ కి రీమేక్ గా చేసిన నన్బన్ తో ఫ్లాప్ సొంతం చేసుకున్నారు. అక్కడి నుంచి కెరియర్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లు పడలేదు. విక్రమ్ తో చేసిన ఐ డిజాస్టర్ అయ్యింది.

రోబోకి సీక్వెల్ గా చేసిన 2.0 బడ్జెట్ పెరిగిపోవడంతో భారీ కలెక్షన్స్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అందుకోలేదు. అయితే కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇండియన్ 2 సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. 28 ఏళ్ళ క్రితం చేసిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా ఉండబోతోంది. జులై 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. అలాగే ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగులో రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తున్నారు.

Read more!

ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇండియన్ 3 కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీటి తర్వాత శంకర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్లానింగ్ ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. దీనిపై తాజాగా ఇండియన్ 2 ప్రమోషన్స్ లో శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ లో జేమ్స్ బాండ్ తరహా స్పై యాక్షన్ కథలు చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు.

అలాగే హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ కథలు కూడా చేస్తానని తెలిపారు. అయితే తన ఆలోచనలని విజువల్ గా పెట్టడానికి భారీ ఖర్చు అవుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ కథలు ఎక్కువగా ఉన్నాయని శంకర్ తెలిపారు. ఇండియన్ 2, 3, గేమ్ చేంజర్ మూవీస్ హిట్ అయితే అతని మీద వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే సౌత్ నిర్మాతలు సినిమా బడ్జెట్ ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. శంకర్ లాంటి దర్శకుడితో అంటే చెప్పిన బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.

సినిమాలపై కృత్రిమ మేధస్సు ప్రభావం ఎప్పటికి ఉండదని మీడియా మీట్ లో శంకర్ తెలిపారు. ఏఐ కంటే మనిషి మేధస్సు చాలా పవర్ ఫుల్. ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో కూడా మనిషి మేధస్సులో ఏఐ పోటీ పడలేదని శంకర్ చెప్పడం విశేషం. అయితే టెక్నాలజీకి నాకు అవసరం అయ్యేంత వరకు కచ్చితంగా ఉపయోగించుకుంటా. టెక్నాలజీకి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చుకోను అని శంకర్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News

eac