గేమ్ చేంజర్.. అసలు డౌట్ క్లియర్!

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు

Update: 2024-07-02 04:15 GMT

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. రెండేళ్లుగా మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికి తుది దశకి రాలేదు. గత నెల రాజమండ్రిలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని టాలీవుడ్ పాన్ ఇండియా మూవీగా చేస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హోల్డ్ లో ఉంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతిగా మరోసారి రాబోతున్నాడు. సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. మరోసారి సేనాపతి విశ్వరూపం చూడటానికి ఆడియన్స్ కూడా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

ఇండియన్ 2 మూవీ ప్రమోషన్స్ లో జర్నలిస్ట్ గేమ్ చేంజర్ గురించి డైరెక్టర్ శంకర్ ని అడిగారు. మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందని, 10-15 రోజుల షెడ్యూల్ మాత్రమే ఇంకా ఉందని శంకర్ తెలిపారు. ఈ యంగ్ జెనరేషన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది అని విలేకరి మళ్ళీ అడిగారు. రామ్ చరణ్ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశారు అని శంకర్ చెప్పారు.

ఇండియన్ 2 మూవీ రిలీజ్ హడావిడిలో ప్రస్తుతం శంకర్ ఉన్నారు. మళ్ళీ ఈ నెల ఆఖరులో గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. షూటింగ్ కంప్లీట్ అయితే గేమ్ చేంజర్ రిలీజ్ పై ఒక స్పష్టత రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ చేసుకొని చరణ్ RC16 షూట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా చరణ్ సిద్ధం అవుతున్నారు.

గేమ్ చేంజర్ మూవీలో ఎస్.జె. సూర్య విలన్ గా నటించగా, కియారా అద్వానీ హీరోయిన్ గా చేసింది. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే అంజలి ఒక హీరోయిన్ గా మూవీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి పాత్రలో చేస్తోన్న రామ్ చరణ్ కి జోడీగా కనిపించబోతోందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News