గేమ్ ఛేంజర్.. శంకర్ ఏం మారలేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్కు కష్టాలు తప్పేలా లేవు.

Update: 2023-09-25 03:00 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్కు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ కొనసాగుతున్న షూటింగ్ను మళ్లీ క్యాన్సిల్ అయినట్లు తెలిసింది. లేటెస్ట్ షెడ్యూల్ ఆగిపోయిందట. దీంతో చరణ్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశ ఎదురైనట్టు అయింది.

వివరాళ్లోకి వెళితే.. గేమ్ ఛేంజర్ ప్రకటించి చాలా కాలమే అయినా.. కనీసం ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో మెగా పవర్ స్టార్ అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ చిత్ర దర్శకుడు శంకర్ కూడా రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణం చేస్తూ ముందుకెళ్తున్నారు. గేమ్ ఛేంజర్తో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా చిత్రీకరిస్తున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ లేట్ అవుతూ.. బడ్జెట్ పెరిగిపోతూ వెళ్తోంది.

శంకర్ మెయిన్ ఫోకస్ అంతా కూడా గేమ్ ఛేంజర్ కన్నా ఎక్కువగా ఇండియన్ 2పైనే ఉన్నట్టుగా అనిపించేలా చేస్తున్నారు. కనీసం ఇండియన్ 2 అప్డేట్స్ అయినా వస్తున్నాయి కానీ.. గేమ్ ఛేంజర్ గురించి మాత్రం రావట్లేదు. అసలీ చిత్ర షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో క్లారిటీ అవ్వట్లేదు. వాయిదాల పద్ధతిలో కొనసాగుతూ ముందుకు పోతోంది.

దానికి తోడు సినిమాలో లీక్స్ జరగడం కూడా ఫ్యాన్స్ను బాగా హర్ట్ చేస్తుంది. రీసెంట్గా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఫుల్ సాంగ్ లీకైపోయింది. దీనిపై లీగల్ చర్యలు కూడా తీసుకున్నారు. అయితే తాజాగా ఇండియన్ 2 షూటింగ్ పూర్తైనట్లు తెలిసింది. దీంతో ఇక శంకర్ ఫోకస్.. గేమ్ ఛేంజర్పై ఉంటుందని అనుకున్నారంతా. అయితే మళ్లీ గేమ్ ఛేంజర్ షూటింగ్ను క్యాన్సిల్ చేశారని తెలిసింది.

లేటెస్ట్ షెడ్యూల్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకోవాల్సి ఉందట. అంతా రెడీ అయిపోయిందట. కానీ దర్శకుడు శంకర్ చివరి నిమిషంలో సడెన్ గా క్యాన్సిల్ చేశారట. కారణం ఏంటో తెలీదు కానీ.. శంకర్ తన ప్లాన్స్ మార్చుకున్నారని తెలిసింది. మళ్లీ త్వరలోనే స్టార్ట్ చేస్తారట. ఇక ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందో కూడా అస్సలు క్లారిటీ లేదు.

Tags:    

Similar News