'జవాన్' ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ?
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'జవాన్' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `జవాన్` ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కింగ్ ఖాన్ షారూఖ్ కథానాయకుడిగా నటించగా, నయనతార కథానాయికగా నటించింది.
అయితే అట్లీ చర్యలపై షారుఖ్ ఖాన్ అభిమానుల్లో నిరాశ ఎదురైందని సమాచారం. ఒరిజినల్ లో ఉన్నట్టు కాకుండా, పొడిగించిన కట్స్ తో OTTలో జవాన్ విడుదల అయింది. అయితే ఇది థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే అదనంగా ఒక నిమిషం ఫుటేజీని మాత్రమే కలిగి ఉంది.
అట్లీ పొడిగించిన కట్ విడుదలను ప్రకటించినప్పుడు అభిమానులు భారీ అంచనాలను కలిగి ఉన్నారు, కానీ ఇంత తక్కువ అటాచ్ మెంట్ తో వారు సంతృప్తి చెందలేదు. మరి భవిష్యత్తులో డిలీట్ చేసిన సీన్స్ ని టీమ్ కనీసం యూట్యూబ్ లో అయినా రిలీజ్ చేస్తుందో లేదో చూడాలి. జవాన్ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. ఇందులో దీపికా పదుకొణె, ప్రియమణి, సన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
`జవాన్` ఫక్తు కమర్షియల్ కథతో
1986లో కెప్టెన్ విక్రమ్ రాథోడ్ భారత సైన్యం `స్పెషల్ ఆప్స్` విభాగంలో కమాండోగా పని చేస్తారు. అతడు 40 మంది భారతీయ సైనికులపై దాడి చేసి చంపిన ఉగ్రవాద సమూహాన్ని వేటాడేందుకు ఆపరేషన్‌ను ప్రారంభించాక ఏమైంది? అన్నదే ఈ సినిమా. ఇందులో విక్రమ్‌ని దేశ ద్రోహిగా ప్రకటించాక ప్రపంచానికి దూరమవుతాడు. ఆ తర్వాత విక్రమ్ పై ఒకానొక దాడిలో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ జ్ఞాపకశక్తి కోల్పోతాడు. ఈశాన్య భారతదేశంలోని ఒక గిరిజన సమూహం అతన్ని కనుగొని రక్షించాక అతడి పునరాగమనం ఏమిటి? అయితే ఇందులో అజాద్ అనే జైలర్ కి విక్రమ్ కనెక్షన్ ఏమిటి? అన్నదే ట్విస్టు. ఒక ఫక్తు కమర్షియల్ ఫార్ములాటిక్ కథను ఎంచుకుని షారూఖ్ లాంటి పెద్ద స్టార్ తో 1000 కోట్ల క్లబ్ ని సాధించాడు అట్లీ. జవాన్ సినిమా ఉత్తరాదిన అద్భుతంగా ఆడినా కానీ, ఇటు సౌత్ లో అంతంత మాత్రంగానే ఆడింది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు మిస్సయిన కానీ ఇపుడు ఓటీటీలో ఈ సినిమాని వీక్షించేందుకు అందుబాటులోకి వచ్చేసింది.