శర్వా 38 - బిగ్ ప్లాన్ తో మొదలెట్టిన మాస్ డైరెక్టర్

టాలెంటెడ్ యువ హీరో శర్వానంద్ డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు

Update: 2024-10-16 07:02 GMT

టాలెంటెడ్ యువ హీరో శర్వానంద్ డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అతని నుంచి ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమా రాబోతోంది. తన తొలి పాన్ ఇండియా సినిమా శర్వా 38 తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్ ప్రత్యేకమైన స్టైల్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో దిట్ట.

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు, మరియు లక్ష్మీ రాధామోహన్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కథలో 1960ల నాటి ఉత్తర తెలంగాణా ప్రాంతంలోని గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, తెలంగాణా-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగే ఆసక్తికరమైన సంఘటనలను ఎంటర్‌టైనింగ్ పద్ధతిలో చూపించనున్నారు.

సాధారణంగా తెలుగు తెరపై ఈ కాలం కథలు అంతగా కనిపించకపోయినా, ఈ సినిమా దాని ప్రత్యేకతతో ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. భయానికి ఆధిపత్యం ఉన్న ప్రపంచంలో, రక్తపాతం సమస్యలకు పరిష్కారంగా మారే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని ఇదివరకే ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

భూమి పూజతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన చిత్ర యూనిట్ భారీ సెట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 15 ఎకరాల విస్తీర్ణంలో సముదాయాన్ని సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలో నిర్మించబడుతున్న ఈ సెట్ 1960ల కాలపు తెలంగాణా-మహారాష్ట్ర ప్రాంతపు జీవనశైలిని ప్రతిబింబించే విధంగా ఎంతో నైపుణ్యంతో రూపుదిద్దుకుంటోంది.

ఈ విస్తృతమైన సెట్స్ లో ఆసక్తికరమైన కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. శర్వానంద్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ 1960ల కాలానికి తగినట్టుగా నటనలోను, లుక్‌లోను మార్పు తీసుకువస్తున్నాడు. ఈ పాత్ర కోసం శర్వా ప్రత్యేకంగా ప్రిపరేషన్ కూడా ప్రారంభించాడు, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది.

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అత్యుత్తమ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. సౌందర్ రాజన్ కెమెరామెన్ కాగా, పాటలు మరియు నేపథ్య సంగీతం కోసం భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానున్నారు. వారికి సంబంధించిన వివరాలను త్వరలో చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.

Tags:    

Similar News