పెళ్లి విషయంలో ప్రదీప్ క్లారిటీ
బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయిన ప్రదీప్ మాచిరాజు ఇప్పటికీ బ్యాచిలర్ గానే కంటిన్యూ అవుతున్నాడు.;

బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయిన ప్రదీప్ మాచిరాజు ఇప్పటికీ బ్యాచిలర్ గానే కంటిన్యూ అవుతున్నాడు. అయితే గత కొంత కాలంగా ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ ఓ రాజకీయ నాయకురాలితో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రదీప్ ను అడగ్గా సమాధానం చెప్పాడు.
టైమ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్తున్న ప్రదీప్, తాను ప్రస్తుతానికైతే పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదని, ఇప్పుడైతే తన టార్గెట్, ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉందని, ముందు కెరీర్ లో సెటిల్ అయి ఆ తర్వాత లైఫ్ లో సెటిల్ అవాలనుకున్నట్టు చెప్పాడు. తాను ఫిక్స్ చేసుకున్న టార్గెట్ కు చేరుకోవడానికి కొంత లేటయిందని, అందుకే తన లైఫ్ లో మిగిలిన విషయాలను కూడా లేటవుతూ వస్తున్నాయని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
సరైన టైమ్ వచ్చినప్పుడు అన్నీ సరిగ్గానే జరుగుతాయంటున్న ప్రదీప్, పొలిటీషియన్ తో పెళ్లి గురించి మాట్లాడుతూ తాను కూడా ఆ వార్తలు విన్నానని, అప్పట్లో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో తన పెళ్లి అన్నారని, ఇప్పుడు రాజకీయ నాయకురాలితో అంటున్నారని, తర్వాత ఏదొక క్రికెటర్ తో పెళ్లి అంటారేమో అని, అవన్నీ కేవలం రూమర్లేనని అన్నాడు.
ఆర్జేగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రదీప్ తర్వాత యాంకర్ గా ఆ తర్వాత నటుడిగా పలు సినిమాలు చేశాడు. తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారి ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ప్రదీప్ హీరోగా నటించిన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
ఈ సినిమాతో నితిన్, భరత్ డైరెక్టర్లుగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రదీప్ ప్రస్తుతం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇంటర్వ్యూలిస్తూ సినిమా గురించి, తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.