పెళ్లి న్యూస్ చెబుతాడనుకుంటే ఇలాంటి షాకిచ్చాడేంటి?
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో రెండవ వివాహానికి రెడీ అయిన సంగతి తెలిసిందే.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో రెండవ వివాహానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. చిరకాల స్నేహితు రాలు, మోడల్ తనుజాని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. జనవరిలో నిశ్చితార్దం కూడా చేసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో అప్పటి నుంచి ప్రేక్షకులంతా పెళ్లి కబురు ఎప్పుడు చెబుతాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ బంధం పెళ్లికి ముందే వీగిపోయనట్లు తెలుస్తోంది.
తాజాగా షైన్ టామ్ నిశ్చితార్దం ఫోటోలు ఇన్ స్టా ఖాతానుంచి తొలగించాడు. ఓ ఇంటర్వ్యూలో మళ్లీ సింగిల్ అనే విషయాన్ని ప్రకటించాడు. తమ బంధం కలుషితంగా మారిందన్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్ప టికీ కలిసి కొనసాగించడంలో విఫలమయ్యాం అన్నాడు. ప్రస్తుతం దృష్టంతా డేటింగ్ యాప్ పై పెట్టినట్లు, నచ్చిన యువతి కోసం వెతుకుతన్నట్లు తెలిపాడు. అలాగే నచ్చితే అమ్మాయిని ఒప్పించడంలో, వారి తల్లిదండ్రులను ఒప్పించడం ఇంకా కష్టం అన్నాడు.
దీంతో మ్యాటర్ మీడియాలోకి వచ్చేసింది. ఇద్దరు వివాహానికి ముందే మనస్పర్దలతో దూరమైనట్లు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `దసరా`లో విలన్ గా నటించాడు. నేచురల్ పెర్పార్మెన్స్ తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తమిళ్ లోనూ సినిమాలు చేసాడు. మలయాళంలో బాగా ఫేమస్ అయిన నటుడు కూడా.
షైన్ టామ్ చాకో కి తొలుత తబితా మాథ్యూస్ తో వివాహమైంది. ఓ కుమార్తె కూడా ఉంది. అయితే కొన్నాళ్లకే కలతలు చోటు చేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం షైన్ టామ్ చాకో నటుడిగా బిజీగా ఉన్నాడు. అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.