కేన్స్ 2024లో తెలుగమ్మాయ్ స్ట్రైకింగ్ లుక్
శోభిత క్లాసిక్ చిక్ లుక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఫ్యాషనిస్టాలు ఎందరు ఉన్నా అందరిలో తెలుగమ్మాయ్ శోభిత యూనిక్ లుక్స్ ఎల్లపుడూ హాట్ టాపిక్. రెడ్ కార్పెట్ నడకల్లో హెడ్ టర్నర్ గా శోభిత నిరూపించింది. ముంబై సహా ఫారిన్ లో చాలా ఈవెంట్లలో షో స్టాపర్ గా పాపులరైంది. శోభిత లుక్ కి ఫిదా కాని వాళ్లు లేనే లేరు. ఇప్పుడు అలాంటి ఒక చిక్ లుక్ తో తెలుగమ్మాయ్ కట్టి పడేసింది. కేన్స్ 2024 దీనికి వేదికగా మారింది.
శోభిత క్లాసిక్ చిక్ లుక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. శోభిత తెల్లటి ట్యాంక్ టాప్ .. గులాబీ రంగు స్కర్ట్‌తో సింపుల్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. ముఖ్యంగా శోభిత ఈ డ్రెస్ కి తగ్గట్టే ఎంపిక చేసుకున్న యాక్సెసరీస్ అద్భుతంగా కుదిరాయి. గోల్డెన్ స్టేట్మెంట్ చెవిపోగులు.. ఓపెన్ హెయిర్ రిలాక్స్డ్ లుక్.. శోభిత కాన్ఫిడెన్స్ ని ఎలివేట్ చేస్తున్నాయని చెప్పాలి. శోభిత బ్రౌన్ లిప్‌స్టిక్ ..మ్యాచింగ్ ఐలైనర్ తో ఆకట్టుకుంది.
ఈ లుక్ కి తగ్గట్టే బ్లాక్ మినీ జిమ్మీ చూ డైమండ్ బ్యాగ్‌తో బాస్ లేడీ వైబ్స్ ని తెచ్చింది. ఓవరాల్ గా శోభిత కేన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తన గట్సీ స్టైల్ అందరినీ ఆకర్షించింది. గూఢచారి, మేజర్ సహా పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన శోభిత ప్రస్తుతం హిందీ చిత్రసీమలో బిజీ ఆర్టిస్ట్. ఇరుగు పొరుగు భాషల్లోను నటిస్తూ బిజీగా ఉంది.