లవ్‌ పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబ్బద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె అసహనం వ్యక్తం చేసింది.

Update: 2024-01-11 07:00 GMT

హీరోయిన్ గా సిద్దు ఫ్రమ్ సికాకుళం సినిమా తో 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్. ఈ అమ్మడు తెలుగు లో చాలా సినిమాల్లో చేసినా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. అయితే ఈ అమ్మడు తెలుగు లో చేసిన పాత్రల వల్ల ఇన్నాళ్లు అయినా గుర్తుండి పోయింది.

శ్రద్దా దాస్ హీరోయిన్ గా సినిమాలు ఎక్కువ చేసినా చేయకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. దాంతో ఈమెకు సినిమాల్లో హిట్స్ లేకున్నా కూడా ఆఫర్లు కంటిన్యూస్‌ గా వస్తూనే ఉండటం మనం చూశాం.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ప్రేమలో ఉందని, ఒక బిజినెస్ మేన్ తో డేటింగ్ లో ఉందని, త్వరలో పెళ్లికి సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ బిజినెస్‌మెన్‌ ఎవరై ఉంటారు అంటూ చాలా మంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

తాజాగా శ్రద్దా దాస్ ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. తాను ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు అంది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబ్బద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె అసహనం వ్యక్తం చేసింది.

ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా తాను ప్రస్తుతం పలు కార్యక్రమాలు, షూటింగ్ తో బిజీగా ఉన్నట్లు పేర్కొంది. స్టేజ్ షో లు మొదలుకుని ఎన్నో షో లు మరియు సిరీస్ ల్లో ఈ అమ్మడు కనిపిస్తున్న కారణంగా ఈ అమ్మడు ఇప్పట్లో పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పింది.

Tags:    

Similar News