అత‌డికే స‌వాల్ విసిరిన పుష్ప‌రాజ్!

స్థానికంగా అక్క‌డ స్టార్ హీరోల చిత్రాల‌న్నింటి రికార్డుల‌ను తుడిచి పెట్టేసింది.

Update: 2024-12-30 17:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప‌-2' పాన్ ఇండియాలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ సినిమా స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్థానికంగా అక్క‌డ స్టార్ హీరోల చిత్రాల‌న్నింటి రికార్డుల‌ను తుడిచి పెట్టేసింది. అక్క‌డ ఈ చిత్రం కేవ‌లం ఓ డ‌బ్బింగ్ చిత్రం మాత్ర‌మే. 'పుష్ప‌-2'కి ప‌ర్పెక్ట్ డ‌బ్బింగ్ కుదిరింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా అయినా హిందీకి అంత‌గా క‌నెక్ట్ అయిందంటే? డ‌బ్బింగ్ అన్న‌ది అంత కీల‌క పాత్ర పోషించింద‌న్న‌ది వాస్త‌వం.

అయితే ఈ సినిమాలో పుష్ప‌రాజ్ పాత్ర‌కు శ్రేయ‌స్ త‌ల్ప‌డే డ‌బ్బింగ్ చెప్పారు. అయితే కొన్ని స‌న్నివేశాల‌కు డ‌బ్బిం గ్ చెప్పడం స‌వాల్ గా మారింద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. 'సాధార‌ణంగా డ‌బ్బింగ్ చెప్ప‌డంలో ఉండే స‌వాళ్లు నాకు ఉత్సాహాన్నిస్తాయి. కానీ 'పుష్ప‌-2'లో అల్లు అర్జున్ మ‌ద్యం తాగుతూ ఉన్న‌ట్లు క‌నిపించిన స‌న్నివేశాల్లో డ‌బ్బింగ్ చెప్ప‌డం క‌ష్టంగా మారింది. అర్జున్ బాడీ లాంగ్వేజ్ కు త‌గ్గ‌ట్టు వాయిస్ మార్చ‌డం అత్యంత స‌వాల్ గా అనిపించింద‌న్నారు.

మొద‌టి భాగానికి డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడు కొన్ని టెక్నిక్ లు తెలుసుకోవ‌డంతో రెండ‌వ భాగం విషయంలో క‌ష్టం త‌గ్గిం ద‌న్నారు. అర్జున్ ఎమెష‌నల్ స‌న్నివేశాల కోసం వాయిస్ లో చాలా మార్పులు తీసుకురావాల్సి వ‌చ్చింద‌న్నారు. బ‌న్నీ తెలుగులో డ‌బ్బింగ్ చెప్పిన కొన్ని స‌న్నివేశాల్లో అత‌డి వాయిస్ నా? అన్న సందేహం క‌లిగింది. అంత‌గా కొన్ని స‌న్నివేశాల్లో బ‌న్నీ మాడ్యులేష‌న్ క‌నిపించింది.

ఆ స‌మ‌యంలో బ‌న్నీకి సైతం స‌వాల్ గానే అనిపించింది. అంత‌గా క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే ఇండియాని షేక్ చేసే హిట్ అందుకున్నారు. త‌దుప‌రి బ‌న్నీ త్రివిక్ర‌మ్ తో పాన్ ఇండియా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం బ‌న్నీలో ఎలాంటి మార్పులుంటాయో చూడాలి.

Tags:    

Similar News