పిక్‌టాక్‌ : కూతురుతో కలిసి బికినీలో శ్రియా

2001 సంవత్సరంలో తెలుగు మూవీ 'ఇష్టం'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్‌.

Update: 2024-12-10 06:53 GMT

2001 సంవత్సరంలో తెలుగు మూవీ 'ఇష్టం'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్‌. మొదటి సినిమా పాజిటివ్ టాక్‌ దక్కించుకోవడంతో రెండో సినిమానే టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జునతో చేసే అవకాశం దక్కింది. టాలీవుడ్‌ కింగ్‌ అప్పుడు మాంచి జోష్‌ మీద ఉన్నారు. ఆయనతో సినిమాలో అది సెకండ్‌ హీరోయిన్‌గా నటించినా మంచి గుర్తింపు దక్కించుకుంది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా దాదాపు స్టార్‌ హీరోలు అందరితోనూ ఈ అమ్మడు సినిమాలు చేసి సక్సెస్‌లు, రికార్డులు, అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ కెరీర్‌లో దశాబ్ద కాలం పాటు చాలా బిజీ బిజీగా గడుపుతూ సినిమాలు చేసింది.


టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్‌, రవితేజ ఇంకా పలువురితో సినిమాలు చేసింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో సూపర్ స్టార్‌ రజనీకాంత్‌తో పాటు విశాల్‌, ధనుష్‌లతో పాటు పలువురు హీరోలతో నటించి మెప్పించింది. హిందీలోనూ ఈమె సినిమాలు చేసింది. హాలీవుడ్‌లో అవకాశాలు సొంతం చేసుకున్న శ్రియా హీరోయిన్‌గా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. కరోనా సమయంలో పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చిన శ్రియా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఫోటోలను షేర్‌ చేస్తోంది.

తాజాగా శ్రియ తన బికినీ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అయ్యింది. గతంలోనూ శ్రియా అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈసారి బీచ్‌ ఫోటోల్లో కూతురు సైతం కనిపించడం ప్రత్యేకమైన విషయం. శ్రియా తన కూతురుతో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రతిసారి వైరల్‌ అవుతూనే ఉంటాయి. పక్కా ఇండియన్‌ పద్దతులు, సాంప్రదాయాలతో తన కూతురును శ్రియా పెంచుతున్నట్లుగా ఆమె గతంలో షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. ఆ మధ్య పంట పొలాల మధ్య తీసుకు వెళ్లి రైతుల గురించి తెలియజేసే ప్రయత్నం చేసింది.

ఇప్పుడు కూతురుతో కలిసి బికినీలో కనిపించిన శ్రియా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తనతో పాటు తన కూతురుకీ ఫన్నీగా పింక్‌ బికినీ ధరింపజేసిన శ్రియా సరన్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. బీచ్‌లో తల్లి కూతురు కెమెరాకు అందంగా ఫోజ్‌లు ఇచ్చారు. శ్రియా తన కూతురును మోడల్‌గా చేయాలి అనుకుంటుందా అంటూ ఈ ఫోటోలకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం శ్రియా మాదిరిగా ఇండియన్‌ సినిమాలో తనూ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News