తెల్ల‌ని కెంపులు పూస‌ల డిజైనర్ క్వీన్ శ్రీ‌య‌

తెల‌తెల్ల‌ని పూస‌లు కెంపుల‌తో డిజైన్ చేసిన ఈ ప్ర‌త్యేక‌మైన వ‌స్త్రంలో శ్రీ‌య శ‌ర‌ణ్ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది

Update: 2024-04-21 06:03 GMT

తెల‌తెల్ల‌ని పూస‌లు కెంపుల‌తో డిజైన్ చేసిన ఈ ప్ర‌త్యేక‌మైన వ‌స్త్రంలో శ్రీ‌య శ‌ర‌ణ్ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. శ్రీ‌య ఇటీవ‌లి ఫోటోషూట్ల‌లోనే ఇది ది బెస్ట్. ప్ర‌ఖ్యాత పీకాక్ మ్యాగ‌జైన్ లేటెస్ట్ క‌వ‌ర్ పేజీ కోసం శ్రీ‌య ఇలా హొయ‌లు పోయింది. ఈ ప్ర‌త్యేక‌మైన ఫోటోషూట్ లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో మ‌తులు చెడే ట్రీటిచ్చింది అందాల శ్రీ‌య‌. అంత‌ర్జాలంలో ఇది వైర‌ల్ గా మారుతోంది.

ఎప్ప‌టిలానే శ్రీ‌య బోల్డ్ అటెంప్ట్ ఇది. శ్రీ‌య ఎంపిక చేసుకున్న ఈ గ‌వ్వ‌లు పూస‌ల డిజైన్ నిజంగానే యూనిక్ గా క‌నిపిస్తోంది. కొంద‌రు ఈ రూపాన్ని చూడ‌గానే బీచ్ ప‌రిస‌రాల్లోకి దారి త‌ప్పి వచ్చిన మ‌త్స్య‌రాణి అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. నిజంగా అంత అందంగా ఈ డిజైన‌ర్ లుక్ లో ఒదిగిపోయింది శ్రీ‌య‌. ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ టాప్ లో శ్రీ‌య హొయ‌లు మ‌తులు చెడ‌గొడుతున్నాయి.

ఇటీవ‌ల త‌న భ‌ర్త‌, కుమార్తెతో క‌లిసి షికార్లు చేసేందుకు శ్రీ‌య ఆస‌క్తిని క‌న‌బరుస్తోంది. మ‌రోవైపు కెరీర్ కోసం తెలివైన ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు సాగుతోంది. సీనియ‌ర్ స్టార్లు అజయ్ దేవ‌గ‌న్ స‌హా ఇత‌రుల‌తో అవ‌కాశాలు అందుకుంటోంది. అటు హిందీ చిత్ర‌సీమ‌తో పాటు, ఇటు టాలీవుడ్ లోను మెరుస్తోంది. మ‌రోవైపు శ్రీ‌య వెబ్ సిరీస్ ల‌పైనా ఫోక‌స్ చేసింది.

విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన `దో ఔర్ దో ప్యార్` స్పెష‌ల్ స్క్రీనింగ్‌కు శ్రీ‌య అటెండ‌యిన సంగ‌తి తెలిసిందే. ప్రివ్యూ వ‌ద్ద‌ ఈ బ్యూటీ చాలా సింపుల్ మేక‌ప్ తో క‌నిపించింది. త‌న బోల్డ్ డిజైన‌ర్ డ్రెస్ ని చూసి ఒక పెద్దావిడ ఘాటైన‌ కామెంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ శ్రీయ ఎంతో తెలివిగా న‌వ్వేస్తూ.. అక్క‌డి నుంచి స్కిప్ కొట్టింది.

Tags:    

Similar News