శ్రియ టిప్ : ఇతరుల సోది ఇలా తప్పించుకోండి
శ్రియ ఇతరులు చెప్పే సోది మాటలు తప్పించుకోవాలంటే, ఇతరులు మన గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే వాటిని పట్టించుకోవద్దు అనుకుంటే రోజుకు ఒక గ్యాలెన్ మంచి నీళ్లు తాగాలి.
రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన అందాల ఆరబోత తో మరియు నటన ప్రతిభ తో కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ శ్రియా సరన్. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది. ఈమె తాజా ప్రాజెక్ట్ షో టైమ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ముద్దుగుమ్మ శ్రియ సరన్ ఈసారి ఒక ఆసక్తికర టిప్ ను షేర్ చేసింది. నెట్టింట ప్రస్తుతం శ్రియ షేర్ చేసిన ఆ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది.
శ్రియ ఇతరులు చెప్పే సోది మాటలు తప్పించుకోవాలంటే, ఇతరులు మన గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటే వాటిని పట్టించుకోవద్దు అనుకుంటే రోజుకు ఒక గ్యాలెన్ మంచి నీళ్లు తాగాలి. అలా తాగడం వల్ల ఎక్కువ సార్లు వాష్ రూమ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. తద్వారా అనవసర ఆలోచనలు ఉండవని సరదాగా పోస్ట్ చేశాడు.
శ్రియా సెన్సాఫ్ హ్యూర్ కి అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ అందాల ఆరబోత ఫోటోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి సెన్సాఫ్ హ్యూమర్ పోస్ట్ లు షేర్ చేయడం అనేది మంచి విషయం అన్నట్లుగా నెట్టింట కొందరు కామెంట్స్ చేస్తున్నారు.