బెస్ట్ యాక్టర్స్​గా ఎన్టీఆర్​-శ్రీలీల.. సైమా అవార్డ్స్​ విజేతలు వీళ్లే

అయితే ఈ అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్​ దక్కించుకున్న ఆర్​ఆర్​ఆర్​ సినిమానే అవార్డులను కూడా దక్కించుకుంది.

Update: 2023-09-16 05:06 GMT

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 వేడుకలు దుబాయి వేదికగా గ్రాండ్​గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు(సెప్టెంబర్ 15) టాలీవుడ్​, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులు హాజరై సందడి చేశారు. వారికి పురస్కారాలు అందజేశారు.


అయితే ఈ అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్​ దక్కించుకున్న ఆర్​ఆర్​ఆర్​ సినిమానే అవార్డులను కూడా దక్కించుకుంది. బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్​​, బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి​, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి​, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్‌ కుమార్‌, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ ఈ చిత్రానికి పురస్కారాలు అందాయి. ఇక ఆ తర్వాత సూపర్ హిట్​ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'కు మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి

ఇంకా ధమకాలో తన యాక్టింగ్​కానూ శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డును దక్కించుకుంది. మృణాల్ ఠాకూర్​కు ఉత్తమ పరిచయ నటిగా అవార్డు వరించింది. ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా మృణాల్ ఠాకూర్​కు అవార్డు దక్కింది. ఉత్తమ సహాయ నటుడుగా రానా (భీమ్లా నాయక్‌) కూడా పురస్కారాన్ని అందుకున్నారు.

ఇక ఈ వేడుకల్లో ప్రతిఒక్కరూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. హీరోయిన్లు రెడ్‌ కార్పెట్‌పై హోయలొలికించారు. వీరిలో శ్రీలీల, మృణాల్ ఠాకూర్ హైలైట్​గా నిలిచారు. ఇక హీరోల్లో ఎన్టీఆర్ లుక్ అదిరింది. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ సూట్​లో రాయల్ లుక్​లో మెరిశారు. ఆయన లుక్​కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఫుల్ ఫైనల్ లిస్ట్ ఇదే..

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు, ఆర్​ఆర్​ఆర్​)

ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)

ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)

ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)

ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)

ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌

ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)

Tags:    

Similar News