కాక పుట్టించిన బ్యూటీ మ‌రో బిగ్ ఆఫ‌ర్!

కోలీవుడ్ స్టార్ శింబు సోలో గా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీల‌క పాత్రలు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-03-19 01:30 GMT

కోలీవుడ్ స్టార్ శింబు సోలో గా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీల‌క పాత్రలు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి `థ‌గ్ లైఫ్` లో న‌టిస్తున్నాడు. అధికారికంగా చేతిలో ఉంది ఈ సినిమా ఒక్క‌టే. ఈనేప‌థ్యంలో తాజాగా శింబు 49వ చిత్రం ఖ‌రారైంది. `పార్కింగ్` ఫేం రామ్ కుమార్ బాల‌కృష్ణ‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

దావ‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుంది. ఇది ఒక డిఫ‌రెంట్ స్టోరీతో తెర‌కెక్కుతోంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఇందులో హీరోయిన్ గా డ్రాగ‌న్ బ్యూటీ క‌యాదు లోహ‌ర్ ని ఎంపిక చేసారు. దీంతో అమ్మ‌డికిది బిగ్ ఛాన్స్ గా మారింది. డ్రాగ‌న్ విజ‌యంతో కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లో సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. అందం.. అభిన‌యం బోల్డ్ అప్పిరియ‌న్స్ తో ఇప్ప‌టికే యువ‌త అటెన్స‌న్ డ్రా చేసింది.

ఇంటర్నెట్ సంచ‌ల‌నంగా మారింది. సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోల‌తో హీటెక్కిస్తుంది. దీంతో ఇప్ప‌టికే రెండు తెలుగు సినిమాల‌కు కూడా సైన్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ రెండు డ్రాగ‌న్ త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాలే. తాజాగా శింబు సినిమాలో ఛాన్స్ రావ‌డంతో? క‌యాదు కెరీర్ ట‌ర్నింగ్ ఛాన్స్ గా మారే అవ‌కాశం లేక‌పోలేదు. శింబుతో హీరోయిన్ గా చేసిన భామ‌లు కాల‌క్ర‌మంలో అగ్ర హీరోయిన్లుగా ఎదిగారు.

ఈ నేప‌థ్యంలో క‌యాదు కూడా ఆ రేంజ్ కి చేరుకోవాల‌ని నెటి జ‌నులు కోరుకుంటున్నారు. కయాదు లోహర్‌ తెలుగులో మూడు ఏళ్ల క్రితమే శ్రీవిష్ణు హీరోగా తెర‌కెక్కిన `అల్లూరి` లో న‌టించింది. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో క‌యాదు పేరు వెలుగులోకి రాలేదు. ప్ర‌స్తుతం అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న `ఫంకీ` సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది.

Tags:    

Similar News