కల్కి 2 - కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు!
‘కల్కి 2898 AD’ మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;
‘కల్కి 2898 AD’ మొదటి భాగం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని స్థాయిలో విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు నాగ అశ్విన్ పూర్తిగా విజయవంతమయ్యాడు. అయితే, తొలి పార్ట్ చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ప్రభాస్ పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ దక్కిందని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయంపై దర్శకుడు నాగ అశ్విన్ స్పందిస్తూ, రెండో భాగంలో మాత్రం ప్రభాస్ పాత్ర పూర్తిగా డామినేట్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నాగ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సమయంలోనే, మొదటి భాగాన్ని స్టోరీ బిల్డప్‌గా తీర్చిదిద్దాలని దర్శకుడు భావించాడట.
కథలోని ప్రధాన పాత్రలు పరిచయం కావడం, వారి నేపథ్యం అర్థమయ్యేలా చేయడం మొదటి భాగంలో ప్రధానంగా కనిపించింది. అయితే, ఇప్పుడు ఆ అన్ని పాయింట్లు క్లియర్ అయ్యాయని, రెండో భాగం పూర్తిగా భైరవ, కర్ణ అంశాల చుట్టూ నడుస్తుందని నాగ అశ్విన్ తెలిపారు. ఎవడే సుబ్రహ్మణ్యం రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ కల్కి విశేషాలను షేర్ చేసుకున్నారు.
నాగ అశ్విన్ మాట్లాడుతూ.. "మొదటి పార్ట్ లో ప్రాముఖ్యత వివిధ పాత్రలకు సమంగా ఉండేలా తీర్చిదిద్దాం. కానీ రెండో పార్ట్ మాత్రం పూర్తిగా ప్రభాస్ పాత్రపై ఆధారపడి ఉంటుంది. భైరవ పాత్రకు పూర్తి స్థాయిలో స్క్రీన్ టైమ్ ఉంటేనే ఆ పాత్ర పైన గట్టిపట్టు వచ్చి, ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అవుతుంది. అందుకే ఈసారి ప్రభాస్ స్క్రీన్ పై ఎక్కువగా కనిపిస్తాడు" అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా ఎక్సైట్ అవుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, మొదటి భాగం పూర్తయ్యాక కమల్ పాత్ర మరింత కీలకంగా మారనుందని తెలుస్తోంది. రెండో భాగంలో భైరవ, కర్ణ పాత్రల కౌంటర్ ట్రాక్‌తో కథ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ఈ సీక్వెల్ కోసం ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ విజువలైజేషన్ వర్క్ జరుగుతోంది.
మొత్తంగా, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరింత తృప్తిని ఇచ్చేలా ఉండనుంది. కథ బిల్డప్ పూర్తి కావడంతో, ఇప్పుడు పూర్తి స్థాయిలో యాక్షన్, థ్రిల్, విజువల్ గ్రాండియర్ కలబోసిన సినిమాగా డెవలప్ కానుంది. రెండో పార్ట్‌లో ప్రభాస్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కడం ఖాయమని నాగ అశ్విన్ స్వయంగా స్పష్టం చేయడంతో, ఈ ప్రాజెక్ట్ మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక సినిమాను 2027లో రావచ్చని తెలుస్తోంది.