‘కోర్ట్’ బాక్సాఫీస్.. 5వ రోజు ఇంకాస్త సాలీడ్ గా..

సాధారణంగా చిన్న సినిమాలు విడుదలైన కొద్ది రోజుల్లో వసూళ్లు తగ్గుతాయి. కానీ ‘కోర్ట్’ మాత్రం ఇందుకు భిన్నంగా దూసుకుపోతోంది.;

Update: 2025-03-19 05:20 GMT

సాధారణంగా చిన్న సినిమాలు విడుదలైన కొద్ది రోజుల్లో వసూళ్లు తగ్గుతాయి. కానీ ‘కోర్ట్’ మాత్రం ఇందుకు భిన్నంగా దూసుకుపోతోంది. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు రామ్ జగదీష్ ఎంతో ఆసక్తికరంగ రాసుకున్న కథ, కోర్ట్ డ్రామా నేపథ్యంలో జరిగిన ఆసక్తికరమైన కథనం, నేచురల్ స్టార్ నాని ప్రెజెంటేషన్ వంటి అంశాలు సినిమాకు అదనపు బలం అయ్యాయి.


మొదటి షో నుంచే సినిమా పట్ల వచ్చిన మంచి మౌత్ టాక్ దీనికి అద్భుతమైన స్టార్ట్ ఇచ్చింది. ‘కోర్ట్’ టీజర్ విడుదలైనప్పటి నుంచే సినిమాపై ఆసక్తి ఏర్పడింది. డిఫరెంట్ జానర్ ట్రై చేసిన నాని టీమ్, రామ్ జగదీష్ దర్శకత్వాన్ని నమ్మి సినిమాను ప్రమోట్ చేయడంతో, ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ రిచ్ ఫిల్మ్‌గా పేరొందింది. చిన్న సినిమాకు కూడా భారీ స్థాయిలో ఆదరణ ఉంటుందని మరోసారి నిరూపించిందీ మూవీ.

సాధారణంగా లీగల్ డ్రామాలంటే బోర్ అనుకునే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని అందించింది. ఇక వసూళ్ల విషయానికి వస్తే, ఐదో రోజుకి కూడా ‘కోర్ట్’ స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించింది. నాలుగో రోజు కంటే ఐదో రోజు ఇంకా పెద్ద వసూళ్లు రాబట్టడం విశేషం. మొత్తం 4.65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. దీంతో టోటల్ గ్రాస్ 33.55 కోట్లకు చేరుకుంది.

ప్రత్యేకంగా అమెరికాలో కూడా ఈ సినిమా సాలీడ్ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే 800K డాలర్ల మార్క్‌ను దాటి, 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ఇది ఓ స్టార్ హీరో లేకుండా వచ్చిన కంటెంట్ బేస్డ్ మూవీకి గర్వించదగిన అచీవ్‌మెంట్. సినిమా మొదటివారంలోనే ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం అనూహ్యం. చాలా సినిమాలు నాలుగో, ఐదో రోజుకే డ్రాప్ అవుతాయి. కానీ ‘కోర్ట్’ మాత్రం వసూళ్లు పెంచుకుంటూ పోతోంది.

దీనికి ప్రధాన కారణం ప్రేక్షకుల ఆదరణ, పాజిటివ్ మౌత్ టాక్. ఇకపోతే ఆరో రోజుకూడా బుకింగ్స్ స్ట్రాంగ్‌గా ఉండడంతో, ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ట్రేడ్ విశ్లేషకులు కూడా ‘కోర్ట్’ లాంగ్ రన్‌లో సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రాన్ని దీప్తి ఘంటా, ప్రశాంతి త్రిపిర్నేని కలిసి నిర్మించగా, నేచురల్ స్టార్ నాని దీనికి ప్రెజెంటర్‌గా వ్యవహరించాడు. ఆయనకు ఉన్న బ్రాండ్ వాల్యూతో పాటు, గతంలో వచ్చిన కంటెంట్ బేస్డ్ సినిమాలకు నాని ఇచ్చిన సపోర్ట్ వల్ల ‘కోర్ట్’ కూడా మంచి విజయం సాధించగలిగింది. ఇప్పటివరకు చూసినట్లయితే, ఈ సినిమా ఇక్కడితో ఆగేలా లేదు. ఇంకా పెద్ద రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా, ‘కోర్ట్’ కోర్ట్ రూం డ్రామా సినిమాలకు ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసే దిశగా ముందుకు సాగుతోంది!

Tags:    

Similar News