ఆయన నమ్మకం నిలబెట్టే బజ్ ఎక్కడ?
ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది ఆయనకు ఓ సెంటిమెంట్ లాంటింది.;
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో `సికిందర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చి 28న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారి కంగానూ ప్రకటించారు. ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది ఆయనకు ఓ సెంటిమెంట్ లాంటింది. ఏ సీజన్ వదిలేసినా ఈద్ ని మాత్రం భాయ్ వదలలేరు.
ఈద్ సందర్భంగా రిలీజ్ అయితే భారీ విజయం సాధిస్తుంది అని సల్మాన్ కి బలమైన నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ తేదీ చూసుకుని సినిమా ప్రారంభించడం...పూర్తి చేయడం చేస్తుంటారు. రంజాన్ కి రెండు రోజుల ముందుగానే అనుకున్నట్లే సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సారి ఆ సక్సెస్ ఇవ్వాల్సిన బాధ్యత మురగదాస్ మీద పెట్టారు. అయితే ఈ సినిమాపై ఇంతవరకూ ప్రచార చిత్రాలతో ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు.
సినిమా ఆరంభం రోజున భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. కానీ టీజర్ రిలీజ్ సహా పాటలు అన్ని రోటీన్ గా ఉండటంతో? సికిందర్ ప్రత్యేకత మిస్ అవుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మురగదాస్ మళ్లీ ఎలాంటి బజ్ తీసుకొచ్చే చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు రిలీజ్ కి ఇంకా వారం రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న సమయంలోనైనా మురగదాస్ సినిమాని పైకి లేపుతాడా? లేక రిలీజ్ తర్వాత టాక్ తర్వాత లేస్తుందా? అన్నది చూడాలి.
అయితే ఓపెనింగ్స్ వరకూ ఎలాంటి సమస్య ఉండదు. సల్మాన్ ఖాన్ ఇమేజ్ తో అది సాధ్యమే. కానీ ఆ పై కంటెంట్ తోనే జనాల్ని రప్పించాల్సి ఉంది. ఆ విషయంలో మురగదాస్ ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ సినిమా విజయం మురగదాస్ కి కూడా అత్యంత కీలకమైంది. కొంత కాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. వైఫల్యాలు...భారీ నష్టాలే కనిపిస్తున్నాయి. మరి సికిందర్ తో ఆ లెక్క మారుస్తాడేమో చూడాలి.