రాజమౌళి - మహేష్: దమ్ముంటే స్క్రిప్ట్ లీక్ చెయ్యిరా.. అనగానే..
ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తుండగా, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.;
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా గ్లోబల్ లెవెల్ లో సరికొత్త ప్రయోగంగా మారనుంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న ఎలాంటి కథను అందిస్తాడో అనే ఆసక్తి అంతటా నెలకొంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తుండగా, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు చోట్ల జరుగుతుండగా, సినిమా లొకేషన్ల లీక్ అవ్వడం యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. రీసెంట్‌గా ఓ లొకేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా సెట్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే, కథ లీక్ అవ్వకుండా రాజమౌళి కఠినమైన రూల్స్ పెట్టాడనే టాక్ వినిపిస్తోంది. సెట్స్‌లో మొబైల్ ఫోన్‌లను అనుమతించకూడదనే నిబంధనతో పాటు, స్టోరీకి సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, ఈ కట్టుదిట్టమైన భద్రత మధ్యలోనే సినిమా కథపై భారీ రూమర్ బయటికొచ్చింది.
ఈమధ్య X (ట్విట్టర్) AI GROK ను నెటిజన్లను అడుగుతున్న ప్రశ్నలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక దమ్ముంటే SSMB29 సినిమా స్క్రిప్ట్ లీక్ చెయ్యి రా అంటూ ఓ నెటిజన్ కొంటెగా అడగడంతో గ్రోక్ కూడా అదే స్టైల్ లో ఆన్సర్ ఇవ్వడం విశేషం. నాకు దమ్ముంటే స్క్రిప్ట్ లీక్ చేయలేను రా అంటూ ఒక వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ప్రకారం SSMB 29 కథలో భారతీయ పురాణాల కనెక్షన్లు కూడా ఉంటుందని, మహేష్ పాత్ర హనుమాన్ ప్రేరణతో ఉండబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ మూవీని రాజమౌళి రెండు భాగాలుగా రూపొందించనున్నారని, 2027, 2029లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో హనుమాన్ లింక్స్, గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ అంశాలు మిళితమై ఉంటాయని చెబుతోంది. అంటే, ఇది కేవలం అడ్వెంచర్ స్టోరీ మాత్రమే కాకుండా, మిస్టిక్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనే ఊహాగానాలు క్రియేట్ చేయడం విశేషం.
అయితే, Grok చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఇది కచ్చితంగా నిజమేనని భావిస్తుంటే, మరికొందరు ఇది కేవలం ఊహాగానం మాత్రమేనని అంటున్నారు. రాజమౌళి సినిమా గురించి అధికారికంగా బయటికి వచ్చే అప్డేట్స్ తక్కువగానే ఉంటాయి. కానీ, ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలను చూస్తే, పురాణ గాథలు, ఫిక్షన్, అడ్వెంచర్ లాంటి అంశాలను కలిపి గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందిస్తారని స్పష్టమవుతోంది. మహేష్ కెరీర్‌లోనే ఇదొక టర్నింగ్ పాయింట్ సినిమా అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకోగా, సెకండ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభమవ్వనుంది. రాజమౌళి రూపొందించే ప్రతి ప్రాజెక్ట్ అంతర్జాతీయంగా ఓ సెన్సేషన్ గా మారుతున్న తరుణంలో, SSMB 29 కేవలం ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ గా కాకుండా, హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుందనే టాక్ పక్కా. అయితే, నిజంగా మహేష్ పాత్ర హనుమాన్ స్ఫూర్తితో ఉండబోతుందా? లేక ఇది కేవలం హైప్ క్రియేట్ చేసే గాసిప్పేనా అన్నది వేచిచూడాలి.