డ్రాగ‌న్ రంగంలోకి దిగేదెప్పుడంటే?

'డ్రాగ‌న్' కి అవ‌స‌ర‌మైన లుక్ కోసం బాడీలో మార్పులు తీసుకొచ్చాడ‌ని లీకైన తాజా ఫోటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది.;

Update: 2025-03-19 05:11 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'వార్ -2' షూటింగ్ లో ఉండ‌గానే 'డ్రాగ‌న్ ' ప‌నులు కూడా మొద‌లు పెట్టాడు. 'డ్రాగ‌న్' కి అవ‌స‌ర‌మైన లుక్ కోసం బాడీలో మార్పులు తీసుకొచ్చాడ‌ని లీకైన తాజా ఫోటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. తార‌క్ తాజా లుక్ లో మ‌రింత స్లిమ్ గా క‌నిపిస్తున్నాడు. మునుప‌టి కంటే మ‌రింత వెయిట్ తగ్గాడు. ముఖంలోనూ చిన్న పాటి మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు.

అలా ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ అవ‌స‌ర‌మైన లుక్ ప‌నులు మూడు నెల‌ల క్రిత‌మే మొద‌లు పెట్ట‌డంతో అది దిగ్విజ‌యంగా పూర్త‌యింది. ఇటీవ‌లే 'వార్ 2' షూటింగ్ నుంచి కూడా తార‌క్ రిలీవ్ అయ్యాడు. దీంతో ఓ నెల రోజుల పాటు విరామం తీసుకుంటాడు. అటుపై ఏప్రిల్ చివ‌రి నుంచి 'డ్రాగ‌న్' షూటింగ్ లో తార‌క్ జాయిన్ అవుతాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ 'డ్రాగ‌న్' షూటింగ్ మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

తార‌క్ లేని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈనెల‌తో పాటు ఏప్రిల్ ముగింపు వ‌ర‌కూ కూడా ఇత‌ర పాత్ర‌ల‌పైనే షూటింగ్ కొన‌సాగుతుంది. అటుపై తార‌క్ ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌ర నుంచి అత‌డి పోర్ష‌న్ పైనే ప్ర‌శాంత్ నీల్ దృష్టి పెట్ట‌నున్నాడు. ఇక తార‌క్ లుక్ ప‌రంగా మార్పులు తీసుకురావ‌డానికి ఇంకా నెల రో జులు స‌మ‌యం ఉంది. ఈ గ్యాప్ లో అవ‌స‌ర‌మైన మార్పులు చేయోచ్చు.

మ‌రి ఇదే గ్యాప్ లో ఫ్యామిలీతో వెకేష‌న్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అన్న‌ది కూడా తెలియాలి. కొంత కాలంగా తార‌క్ షూటింగ్ ల‌తోనే బిజీ బిజీగా గ‌డిపాడు. 'దేవ‌ర' పూర్త‌యిన వెంట‌నే 'వార్ -2' లో జాయిన్ అవ్వ డంతో ఇప్ప‌టి వ‌ర‌కూ విశ్రాంతి దొర‌క‌లేదు. దీంతో ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌లేకపోయాడు. మ‌రి ఈ గ్యాప్ లో ఫారిన్ టూర్ చెక్కేసిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Tags:    

Similar News