భారీ విజువల్ ట్రీట్ కి సిద్ధమైన L2E: ఎంపురాన్.. న్యూ సర్ ప్రైజ్!
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ L2E: ఎంపురాన్ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి;
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ L2E: ఎంపురాన్ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇది 2019లో విడుదలైన బ్లాక్‌బస్టర్ లూసిఫర్ కి సీక్వెల్‌గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే కొత్త అప్‌డేట్ అందరినీ ఉత్సాహపరుస్తోంది. ఆ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా భారీ స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల కానుంది. ఇది మలయాళ సినిమా చరిత్రలో మొదటి ఐమాక్స్ రిలీజ్ కావడం విశేషం.
ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌లాల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. "మలయాళ ఇండస్ట్రీలో మొట్టమొదటి సారిగా IMAX ఫార్మాట్‌లో మా L2E: ఎంపురాన్ విడుదల కానుండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఇది మలయాళ సినిమాకు ఓ కొత్త ప్రయాణం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ థియేటర్లలో ఈ చిత్రాన్ని మార్చి 27న చూసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. దీంతో తెలుగు సహా అన్ని భాషల్లోనూ ఈ సినిమా మరింత హైప్‌ను సొంతం చేసుకుంది.
ఈ సినిమా అత్యంత అధునాతన టెక్నాలజీతో చిత్రీకరించబడింది. 1:2.8 అనామార్ఫిక్ ఫార్మాట్‌లో తెరకెక్కిన ఈ మూవీ, IMAX స్క్రీన్ల కోసం మరింత అద్భుతంగా ప్రిపేర్ చేయబడుతోంది. ఈ ఫార్మాట్ ద్వారా భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులకు మరింత రిచ్‌గా అనిపించనున్నాయి. ముఖ్యంగా ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌లు, సీరియస్ డ్రామా, మైండ్‌గేమ్ ఎలిమెంట్స్ అన్నీ ఈ పెద్ద స్క్రీన్ అనుభూతిలో కొత్త హైబ్రిడ్ లెవల్‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
మోహన్‌లాల్ ఈ సినిమాలో ఖురేషి అబ్రామ్, స్టీఫెన్ నెడుంపల్లి పాత్రల్లో నటించనుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, సచిన్ ఖేడేకర్, నైలా ఉషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతే కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఈ సినిమాతో ఇండియన్ సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ హై బడ్జెట్ సినిమాను లైకా ప్రొడక్షన్స్, ఆశిర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు SVC రీలీజ్ ద్వారా విడుదల చేయనున్నారు.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకోగా, ఐమాక్స్ విడుదలతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. మొత్తానికి, 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లపై ప్రేక్షకులకు గ్రాండ్ విజువల్ ట్రీట్ అందించేందుకు L2E: ఎంపురాన్ సిద్ధమవుతోంది. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.