బీడీలతో సితార హీరోల మాస్ పొగలు!

బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే త్రివిక్రమ్ అల.. వైకుంఠపురములో.. సినిమా కోసం అల్లు అర్జున్ చేత బీడీ పట్టించాడు.

Update: 2023-11-15 10:56 GMT
బీడీలతో సితార హీరోల మాస్ పొగలు!
  • whatsapp icon

వింటేజ్ హీరోలు రామారావు నుంచి స్టార్ హీరోల స్మోకింగ్ స్టైల్ సినిమాలకు ఒక రేంజ్ లో కలిసొస్తోంది. ఇక మాస్ అప్పీల్ రావాలి అంటే సిగరెట్ అనేది ఓ వర్గం హీరోలకు కామన్ స్టైల్ గా మారిపోయింది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ , కూలి సినిమాలో వెంకీ కాస్త స్టైల్ మార్చి బీడీ వాడకంతో మరో కొత్త ట్రెండ్ షురూ చేశారు.

ఇక మొన్నటి వాల్తేరు వీరయ్య లో కూడా మెగాస్టార్ అలాంటి ఉర మాస్ తో మెప్పించాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంపౌండ్ సైడ్ అయితే ఈ మధ్య బీడీ వాడకం ఎక్కువయ్యింది. మాస్ పొగలతో హీరోలు బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే త్రివిక్రమ్ అల.. వైకుంఠపురములో.. సినిమా కోసం అల్లు అర్జున్ చేత బీడీ పట్టించాడు.

ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయానికి వచ్చేసరికి మహేష్ ను చేత బీడీ లేకుండా చూపించడం లేదు. పోస్టర్ అయినా సాంగ్ అయినా బీడీ ఉండాల్సిందే అనేలా హైలెట్ చేస్తున్నారు. మాస్ అప్పీల్ ఇంకా లోతుగా ఉండాలని స్టైలిష్ హీరోలను ఈ విధంగా బీడీ పొగలో చూపిస్తున్న విధానం కొత్తగానే ఉంది. ఇక సితార ప్రొడక్షన్ లొనే రూపొందుతున్న ఆదికేశవ సినిమాలో కూడా బీడీ హడావుడి ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ పోస్టర్ లో హీరో వైష్ణవ్ తేజ బీడీ కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో కూడా త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చూన్ ఫోర్ హ్యాండ్ ఉంది. ఓ విధంగా త్రివిక్రమ్ సైడ్ బీడీ పొగ తో మాస్ మ్యానియా ఎక్కువగా కనిపిస్తోంది. వైష్ణవ్ లాంటి కుర్ర హీరోకి ఈ బీడీ స్టిల్ బాగానే సెట్టయ్యింది.

ఇక సినిమా కాంటెంట్ కు తగ్గట్టుగా బీడీ స్టిల్స్ వైరల్ అయితే రాబోయే రోజుల్లో బీడీ పొగ టాలీవుడ్ లో మరింత గుప్పుమనక తప్పదు. ఇక గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు పొలిటికల్ మాస్ యాక్షన్ అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే థమన్ నుంచి వచ్చిన ఒక సాంగ్ బాగానే క్లిక్ అయ్యింది. ఇక మరోవైపు వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ్ వచ్చే వారం విడుదల కాబోతోంది.

Tags:    

Similar News