ఆమె 'అన్న' అనడంతో అయ్యో అనిపించింది..!

సాయి పల్లవి నేచర్‌ ఏంటి అనేది శివ కార్తికేయన్‌ వ్యాఖ్యలతో అర్థం అయింది.

Update: 2024-10-19 07:53 GMT

మలయాళం మూవీ ప్రేమమ్‌ ద్వారా హీరోయిన్‌గా సాయి పల్లవి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాతోనే తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులకు సైతం సాయి పల్లవి పరిచయం అయిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో సాయి పల్లవి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు నుంచే ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఫిదా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సాయి పల్లవి టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా నిలిచింది. సాయి పల్లవి పలువురు స్టార్‌ హీరోల సినిమాలను తిరస్కరించిందని గతంలో వార్తలు వచ్చాయి.

తాజాగా ఈమె తమిళంలో 'అమరన్‌' సినిమాలో నటించింది. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఒక వీర జవాన్‌ రియల్‌ కథతో రూపొందింది. ఈనెల 31న అమరన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా గురించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మణిరత్నం మాట్లాడుతూ సాయి పల్లవితో ఒక సినిమా చేయాలని ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అదే ఈవెంట్‌ లో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ సాయి పల్లవి గురించి మాట్లాడిన మాటలు మరింతగా షాకింగ్ గా ఉన్నాయి. సాయి పల్లవి నేచర్‌ ఏంటి అనేది శివ కార్తికేయన్‌ వ్యాఖ్యలతో అర్థం అయింది.

సాయి పల్లవి ని ప్రేమమ్‌ సినిమాలో చూసి ఫిదా అయ్యాను. ఆమె నటన చూసి ఆమెను అభినందించాలి అనుకున్నాను. ఆమె నెంబర్‌ సంపాదించి కాల్‌ చేశాను. నటన బాగుంది అంటూ నేను ప్రశంసిస్తే ఆమె నుంచి థాంక్స్ అన్న అంటూ సమాధానం వచ్చింది. ఆ సమాధానంకు నేను షాక్‌ అయ్యాను అంటూ శివ కార్తికేయన్ చెప్పుకొచ్చాడు. అందమైన అమ్మాయి అన్న అంటే ఎవరైనా అయ్యో అనాల్సిందే. శివ కార్తికేయన్ సైతం సాయి పల్లవి నుంచి ఆ సమాధానం వచ్చిన వెంటనే అయ్యో అనుకుని ఉంటాడు. అదే విషయాన్ని అమరన్‌ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో చెప్పడం ద్వారా వైరల్‌ అయ్యాడు. సాయి పల్లవి ఎంతటి వారిని అయినా చాలా గౌరవంగా చూస్తుంది అనడానికి ఇదే నిదర్శనం.

అమరన్ సినిమాలో శివ కార్తికేయన్‌ కి జోడీగా సాయి పల్లవి నటించింది. ఇద్దరి మధ్య మంచి సీన్‌ లు ఉన్నాయని, ఇద్దరూ ఎమోషనల్‌గా అద్భుతంగా నటించారు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా సినిమా ఉంటుందని, తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు అంటూ మేకర్స్ చెబుతున్నారు. సాయి పల్లవి కోసం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలి అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్‌ చేసిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక తప్పకుండా టాలీవుడ్‌లో అమరన్‌ సినిమా మినిమం వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News