సెట్స్ లోనే టెన్షన్..సెట్స్ బయట కాన్పిడెన్స్ మాత్రమే! బోయపాటి
ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య 'స్కంద' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే
ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య 'స్కంద' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరి కలయికలో తొలిసారి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రం. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు హైప్ తీసుకొస్తు న్నాయి. టీజర్..ట్రైలర్ ప్రతీది 'స్కంద'ని పతాక స్థాయికి తీసుకెళ్లింది. రామ్ ఎనర్జీనిమ్యాచ్ చేస్తూ పక్కా బోయపాటి మార్క్ ఎంటర్ టైనర్ అని తేలిపోయింది. దీంతో ఇద్దరి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ.
రిలీజ్ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుంది? ఎలాంటి అంశాలతో మెప్పించబోతారు? అన్న ఉత్సాహం అభిమానుల్లో ఉరకలేస్తుంది. తాజాగా నిన్నటి రోజున కరీనంగర్ లో నిర్వహించిన కల్ట్ జాతరతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. కరీనంగర్ అభిమానుల సందోహంలో రామ్ మాస్ డైలాగుల ట్రైలర్ మరోసారి పేలింది. థమన్ ఆర్ ఆర్ యాక్షన్ ఎపిసోడ్లని మరింత హైలైట్ చేసాయి.
మాస్ తో పాటు సినిమాలో కావాల్సినంత ఎమోషన్ ఉంది. సంతోష్ డిటాకే కెమెరా పనితనం సినిమాకి అదనపు అస్సెట్ గా కలిసొస్తుంది. ఇక వేదికపై రామ్ వ్యాఖ్యలు అభిమానుల్ని మరింత అలరించాయి. యాక్షన్ వెనుక అద్భుతమైన ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్ గా చెప్పుకొచ్చారు. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే సినిమా ఇదన్నారు.
అలాగే బోయపాటి మార్క్ సందేశం కూడా సినిమాలో ఉంటుందని రివీల్ చేసారు. ఈ వేదిక సాక్షిగా బోయపాటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసారు. 'నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడతాను. ఒక్కసారి అవుట్ పుట్ వచ్చిన తర్వాత ఇంక టెన్షన్ వుండదు. ఎందుకంటే చాలా బాగా తీశాననే నమ్మకం. స్కంద ఆ కోవకు చెందిన సినిమా' అన్నారు.