'స్కంద' ఎమోష‌న్ వ‌ర్క‌వుటైతే ఎక్క‌డికో..!

మొదటి ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్స్‌లో చూపించ‌గా యాక్షన్ లో హై పంచ్ ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత మరో ట్రైలర్‌ని విడుదల చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

Update: 2023-09-27 15:39 GMT

అఖండ సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ పోతినేని హీరోగా మరో ఇంటెన్స్ యాక్షన్ మూవీ 'స్కంద'తో వస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్ ఇండియా చిత్రానికి జాతీయ స్థాయిలో హైప్ రావ‌డంలో టీమ్ ప్ర‌చారం ప్ర‌ముఖ పాత్ర పోషించింది. మొదటి ట్రైలర్‌లో రామ్‌ని రెండు డిఫరెంట్ లుక్స్‌లో చూపించ‌గా యాక్షన్ లో హై పంచ్ ఆక‌ట్టుకుంది. ఆ తర్వాత మరో ట్రైలర్‌ని విడుదల చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

ఈ రెండో ట్రైల‌ర్ గూస్‌బంప్స్ తెచ్చింది. యాక్ష‌న్ డ్రామా మాస్ ఎలిమెంట్స్‌తో విడుదలైన ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. డైలాగ్స్ ప్యూర్ మాస్ స్టఫ్ తో హీట్ పెంచ‌గా, రామ్ మునుపెన్నడూ లేని గెటప్ తో అందరినీ విస్మయపరిచారు. ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్ లు లాంచ్ చేసినా కానీ..తెలివిగా బోయపాటి సినిమా కి సంబంధించిన కోర్ పాయింట్‌ను రివీల్ చేయ‌లేదు ఎక్క‌డా. విడుదలకు ముందు ఎటువంటి లీక్‌లు లేకుండా చూసుకున్నాడు.

ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ‌లీల‌ మొదటి రెండు పాటల్లో రామ్ కి ధీటుగా న‌ర్తించి అద‌ర‌గొట్టింది. మూడో పాటలో సయీ మంజ్రేకర్ నాల్గవ నంబర్‌లో ఊర్వశి రౌతేలాపై ప్రత్యేక నంబర్ ఎంతో స్పెష‌ల్ గా అల‌రించ‌నున్నాయని క్లారిటీనిచ్చారు. హీరోయిన్లందరినీ పరిచయం చేయడానికి ఇది మరో తెలివైన వ్యూహంగా వ‌ర్క‌వుటైంది. సినిమాలోని ఎమోషన్ వ‌ర్క‌వుటైతే స్కంద రామ్‌కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఎమోష‌న్.. యాక్ష‌న్.. రొమాన్స్.. ఫ్యామిలీ స్ట‌ఫ్ ఇలా అన్ని విధాలా స్కంధ ఫుల్ మీల్స్ అవుతుంద‌ని టీమ్ చెబుతోంది.

Full View
Tags:    

Similar News