వారి కోసం మేడం స్నేహా రెడ్డి సలహాలు
అల్లు అర్జున్ భార్య స్నేహా హీరోయిన్స్ రేంజ్ లో ఏకంగా 9 మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్ స్టా లో కలిగి ఉన్న విషయం తెల్సిందే.
టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో పలువురు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబు భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డితో పాటు ఇంకా కొందరు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారు.
అల్లు అర్జున్ భార్య స్నేహా హీరోయిన్స్ రేంజ్ లో ఏకంగా 9 మిలియన్ ల ఫాలోవర్స్ ను ఇన్ స్టా లో కలిగి ఉన్న విషయం తెల్సిందే. ఆమె తన పిల్లలు అల్లు అర్హ మరియు అయాన్ లకు సంబంధించిన విషయాలను రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా పిల్లల తల్లిదండ్రులకు స్నేహా రెడ్డి చక్కని సలహాలు ఇస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. పిల్లల తల్లిదండ్రులు ఈ ఆరు పాయింట్స్ ను పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఆమె సూచించింది. పిల్లల యొక్క మానసిక వికాసంతో పాటు, ఫిజికల్ ఫిట్ నెస్ కి ఆమె సలహాలు అద్భుతం అంటూ చాలా మంది కితాబిస్తున్నారు.
స్నేహా రెడ్డి ఆరు పాయింట్స్... 1. పిల్లలు క్రియేటివిటీతో ఆలోచించేలా వాతావరణం క్రియేట్ చేయాలి, 2. వారంలో పిల్లలతో చేయించాల్సిన పనులను ముందే ప్లాన్ చేసుకోవాలి, 3. పిల్లలు ఎండలో మినిమం సమయం ఉండేలా చూసుకోవాలి, 4. పిల్లల్లో ఊహా శక్తి పెంచెందుకు గాను ప్రయత్నాలు చేయాలి, 5. పిల్లలో జాలి, కరుణ వంటి గుణాలు పెంచాలి, 6. తల్లలు పిల్లలకే పూర్తి సమయం కేటాయించకుండా తమ వ్యక్తిగతం కోసం కూడా సమయం కేటాయించుకోవాలి.
ఇలా ఆరు విషయాల పట్ల శ్రద్ధ వహించాలంటూ ముఖ్యంగా తల్లులకు స్నేహా రెడ్డి సూచించారు. నిజంగా స్నేహా సూచించిన ఈ ఆరు సూత్రాలు తప్పక పాటించాల్సినవిగా ప్రముఖులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.