మ్యాకప్ ఒక్కటే కాదండోయ్..అంతకు మించి!
ఇండస్ట్రీలో రెండు పవడల ప్రయాణం అంత వీజీ కాదు. స్వీయా దర్శకత్వంలో నటిస్తూ..సినిమాలు నిర్మించడం అన్నది కొందరికే సాధ్యం.
ఇండస్ట్రీలో రెండు పవడల ప్రయాణం అంత వీజీ కాదు. స్వీయా దర్శకత్వంలో నటిస్తూ..సినిమాలు నిర్మించడం అన్నది కొందరికే సాధ్యం. నాటి ఎన్టీఆర్..కృష్ణ రెండు రంగాల్లో రాణించిన మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాల్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తరంలో అంతటి పేరు ప్రఖ్యాతలు విశ్వనటటు కమల్ హాస్ కే దక్కింది. ఇక ఇప్పటితరం లో చూసుకుంటే ప్రముఖంగా కొంత మంది యంగ్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
ధనుష్..విజయ్ ఆంటోనీ..విశ్వక్ సేన్..అడవి శేషు..సిద్దు జొన్నల గడ్డ లాంటి వారు కనిపిస్తున్నారు. కొంత మంది నటిస్తూ దర్శకత్వం వహిస్తుంటే మరికొంత మంది రచనా విభాగంలో పనిచేసిన నటిస్తున్నారు. ధనుష్ ల్యాండ్ మార్క్ 50వ చిత్రం `రాయన్`. ఈ చిత్రంలో ఆయనే నటిస్తూ తెరకెక్కిస్తున్నాడు. ధనుష్ దర్శకత్వం వహిస్తోన్న రెండవ చిత్రమిది. ఇంతకు ముందు పా పాండి అనే చిత్రాన్ని ఆయనే తెరకెక్కించారు.
ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర గురించైతే చెప్పాల్సిన పనిలేదు. నటన..దర్శకత్వంలో ఆయన ఓ సంచలనం అన్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో తానే హీరోగా ప్రూవ్ చేసుకున్న నటుడు. మహిళల్ని ఉద్దేశించి ఆయన తీసిన కొన్ని సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా `యూఐ` అనే చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఉపేంద్ర లా సినిమాలు తీయడం తనకు తప్ప ఎవరికీ సాధ్యం కాదని ప్రశాంత్ నీల్ సైతం కీర్తించాడు.
అలాగే `కాంతార`తో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తనని తానే పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించుకున్నాడు. ఆ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించిన నటించిన సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడా సీనిమాకి ప్రీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక విశాల్ కూడా 25 ఏళ్ల తన దర్శకత్వం కలని నెరవేర్చుకుంటున్నాడు.
`డిటెక్టివ్ -2` చిత్రంలో నటిస్తూ ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ కంనగ కూడా తన సినిమాల్లో తానే నటిస్తూ తెరకెక్కిస్తుంది. ఆమె కొంత కాలంగా ఇదే పార్మెట్ లో సినిమాలు చేస్తుంది. `మణికర్ణిక` సినిమాతో మెగా ఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టాలీవుడ్ లో కొంత మంది నటులు దర్శకులుగా మారి సినిమాలు చేస్తున్నారు.