భ‌ర్త‌తో సోనాక్షి సిడ్నీలో 2025 సెల‌బ్రేష‌న్

గత కొంత కాలంగా ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వెళ్లిన నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ సిడ్నీలో న్యూ ఇయర్ వేడుక‌ల్లో పాల్గొన్నారు.

Update: 2025-01-01 10:28 GMT

కొత్త‌సంవ‌త్స‌ర సంబ‌రాల కోసం బాలీవుడ్ ప్రేమ‌ప‌క్షులు విదేశాల్లో వాలిపోయిన సంగ‌తి తెలిసిందే. అంగ‌రంగ వైభ‌వ‌మైన NYE2025 సెల‌బ్రేష‌న్స్ నుంచి ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ సెల‌బ్స్ చిల్ అవుతున్నారు. గత కొంత కాలంగా ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వెళ్లిన నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ సిడ్నీలో న్యూ ఇయర్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం సోనాక్షి ఇన్‌స్టాలో తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

దాంతో పాటు భ‌ర్త ఇక్బాల్‌తో త‌న సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మిడ్ నైట్ లో కొత్త సంవ‌త్స‌రాన్ని స్వాగ‌తిస్తూ బాణసంచా ట్రీట్ కి సంబంధించిన‌ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఆస్ట్రేలియన్ స్టైల్‌లో 2025కి స్వాగతం పలుకుతూ ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ``హుమారా హ్యాపీ న్యూ ఇయర్ హో గయా!!! హ్యాపీ న్యూ ఇయ‌ర్ అని సోనాక్షి పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది.

సోనాక్షి- జ‌హీర్ ప్రేమ వివాహానికి తొలుత సోనాక్షి కుటుంబం నుంచి అభ్యంత‌రం ఎదురైంది. సోనాక్షి తండ్రి శ‌త్రుఘ్న‌ను ఒప్పించేందుకు సోనాక్షి, జ‌హీర్ ప్ర‌య‌త్నించారు. కానీ అది అంత సులువుగా జ‌ర‌గ‌లేదు. ఈ ఏడాది జూన్ 23న జహీర్‌ను ముంబైలోని అత‌డి నివాసంలో కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో సోనాక్షి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ముంబై పాపుల‌ర్ రెస్టారెంట్ బాస్టియన్‌లో విందు కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనికి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. చివ‌రి నిమిషంలో శ‌త్రుఘ్న సిన్హా, అత‌డి కుటుంబం ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు.

సోనాక్షి - జహీర్ జంట పెళ్లికి ముందు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఈ జంట ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కనిపించారు. టీవీ షోలో తమ డేటింగ్ జీవితం గురించి ప్ర‌తిదీ ఓపెన‌య్యారు. శత్రుఘ్న సిన్హాను సంప్రదించడానికి తన ప్రారంభ ప్రయత్నాలను జహీర్ గుర్తు చేసుకున్నాడు. ``నేను వారిని రెండుసార్లు సందర్శించినప్పుడు 6 నుంచి 8 మంది అంగరక్షకులు చుట్టూ నిలబడి ఉన్నారని జ‌హీర్ అన్నారు. అప్పుడు కూతురుని ఇవ్వ‌మ‌ని, పెళ్లి చేయమని అడగడం ఎలా సాధ్యం? అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. అవును.. అత‌డు మా అమ్మా నాన్న‌తో మాట్లాడ‌టానికి వెళ‌తాన‌ని అన్నప్పుడు మాట్లాడండి అని చెప్పిన‌ట్టు సోనాక్షి తెలిపింది. నేను వారితో ఎందుకు మాట్లాడాలి? నేను మా నాన్నతో మాట్లాడాను.. నువ్వు మీ వాళ్ల‌తో మాట్లాడాలి.. అని కూడా జ‌హీర్ ఫ‌న్ ని కొన‌సాగించాడు. సోనాక్షి -జహీర్ 2022లో డబుల్ ఎక్స్‌ఎల్ అనే చిత్రంలో కలిసి నటించారు. జ‌హీర్, సోనాక్షి ల‌కు స‌ల్మాన్ కామ‌న్ ఫ్రెండ్ అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News