సోనాక్షి సిన్హా పెళ్లికి అన్నయ్యలు ఢుమ్మా!
ఈ పెళ్లి అన్నయ్యలిద్దరికీ ఇష్టం లేకపోవడంతోనే వారు హాజరవ్వలేదని బాలీవుడ్ మీడియాలో వార్తలొ స్తున్నాయి.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా -జహీర్ ఇక్బాల్ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ వివాహానికి సోనాక్షి తల్లిదండ్రులకు ఇష్టం లేదని నెట్టింట ప్రచారం జరిగింది గానీ ఆ తర్వాత అలాంటిదేమి లేదని తమ ఇష్ట ప్రకారమే కుమార్తె పెళ్లి జరుగుతుందని..తప్పుడు కథనాలు రాయోద్దని వేడుకున్నారు. అటుపై పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగింది.
అంతకు ముందు ప్రీవెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే చెల్లి పెళ్లి దగ్గరుండి జరిపించాల్సి సోనాక్షి అన్నయ్యలు ఇద్దరు మాత్రం వేడుకలో ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నలు లవ్ సిన్హా, ఖుష్ సిన్హా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో గానీ, పెళ్లి రోజు గానీ, రిసెప్షన్ లో గానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో వారిద్దరు ఎక్కడా? అంటూ అంతా చర్చించుకుంటున్నారు.
ఈ పెళ్లి అన్నయ్యలిద్దరికీ ఇష్టం లేకపోవడంతోనే వారు హాజరవ్వలేదని బాలీవుడ్ మీడియాలో వార్తలొ స్తున్నాయి. ఈ విషయాన్ని లవ్ సిన్హా దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రెండు రోజులు సమయం ఇవ్వండి. నాకు బధులివ్వాలనిపిస్తే అప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని స్కిప్ కొట్టాడు.
పెళ్లి కుమార్తె సోదరుడిగా అన్నయ్య చెయ్యాల్సిన పనులను నటుడు , సోనాక్షి స్నేహితుడు సఖీబ్ సలీమ్ పనులన్నింటిని తన భుజాన వేసుకుని మోసాడు. సోనాక్షిని మండపానికి తీసుకొచ్చే సమయంలో పూల చద్దర్ ని సఖీబ్ పట్టుకుని నడిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో సొంత అన్నయ్యలు ఎక్కడ? అన్న చర్చీ తీవ్ర స్థాయిలో నెట్టింట మొదలైంది.