గేమ్​ ఛేంజర్​ లీక్​ సాంగ్​.. మెగా ఫ్యాన్స్ ఫుల్ సీరియస్​

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్' తెరకెక్కుతోంది.

Update: 2023-09-16 06:36 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్' తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు సరైన అప్డేట్ ఒకటి రాలేదు. కానీ ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎదో ఒక లీక్ బయటకి వస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు జరగండి జరగండి అనే సాంగ్ లీక్ అయి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

అయితే ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ అవుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే ఇలా చేయడం సరికాదని, దయచేసి షేర్ చేయడం ఆపండంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ సినిమా తెగ వైరల్ అయిపోయింది. మరోవైపు ఈ పాటపై నెగటివ్​ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పాట బాగోలేదంటున్నారు.

సాధారణంగా శంకర్ సినిమాలో పాటలంటే భారీ స్థాయిలో అత్యాధునిక హంగులతో సూపర్ లిరిక్స్​తో ఉంటాయి. కానీ ఈ పాట అలా లేదంటూ పలువురు సినీ ప్రియులు, మెగా ఫ్యాన్స్​ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్ ఇచ్చిన ఊర మాస్ బీట్​ మ్యూజిక్, అలాగే రొట్ట లిరిక్స్ అసలు సెట్​ అవ్వలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఎవర్రా రాసిందంటూ అంటూ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇకపోతే ఈ లీక్ విషయంలో మూవీటీమ్​ కూడా సరైన యాక్షన్ తీసుకోనేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిసింది. వీలైనంత వరకు సాంగ్​ను కూడా సోషల్​ మీడియా నుంచి డిలీట్ చేయిస్తోందట. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఈ పాట బాగా వైరల్ అయిపోయింది. ఒరిజినల్ సాంగ్​ ఎలా ఉండబోతుందో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. చూడాలి మరి మూవీటీమ్ ఏం చేస్తుందో? ​ సాంగ్​లో ఏమైనా మార్పులు చేస్తుందా లేదా అనేది..

కాగా, ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ఈ చిత్రాన్ని బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకండా నిర్మిస్తున్నారట. అందుకు తగ్గట్టే శంకర్ కూడా తెరకెక్కిస్తున్నారట. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా రాబోతుంది. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారనే వార్తలు మొదటి నుంచి వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత ఈ చిత్రం వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News