బాలీవుడ్ ని రిజెక్ట్ చేసి టాలీవుడ్ లో అందుకే!
బాలీవుడ్ నటుడుగా సోనుసూద్ ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా నటిస్తుంటారు.
బాలీవుడ్ నటుడుగా సోనుసూద్ ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా నటిస్తుంటారు. ఈ రెండింటికి మించి గొప్ప మానవతావాధి..సేవా దృక్పధం ఉన్నవాడు. నటుడిగా కంటే గొప్ప వ్యక్తిత్వం గల మనిషి గా ప్రజలకు దగ్గరయ్యారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలే అంతటి వాడిని చేసాయి. తాజాగా ఓ సినిమా ప్రచారం కోసం సికింద్రాబాద్ విచ్చేసిన సోనుసూద్ తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
`నేను పంజాబ్ కి చెందిన వ్యక్తిని. అయినా తెలుగు ప్రేక్షకులు తమ బిడ్డలా ఆదరిస్తున్నారు. అందుకే తెలుగు సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నా. హిందీ సినిమాలు కూడా కమిట్ అవ్వకుండా ఇక్కడ సినిమాలు చేస్తాను. తెలుగు సినిమా నాకు ఎన్నో విలువలు నేర్పింది. అందులో క్రమ శిక్షణ ఒకటి. తురుమ్ ఖాన్ అనే సినిమాలో మంచి పాత్ర పోషించా. భవిష్యత్ లో రెండు...మూడు భాగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
వాటిలో కూడా నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నా` అని అన్నారు. సోనుసూద్ కెరీర్ 99లోనే కోలీవుడ్ సినిమాతో మొదలైంది. విజయ్ కాంత్ హీరోగా నటించిన `కల్లాజాగర్` అనే సినిమాతో లాంచ్ అయ్యారు. అటుపై `హ్యాండ్స్ అప్` అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుంచి హిందీ కెళ్లారు. నటుడిగా అక్కడ తొందరగా గుర్తింపు వచ్చింది. దీంతో అక్కడ చాలా సినిమాలు చేసారు.
ఈ క్రమంలో తెలుగు..తమిళ్ లోనూ బిజీ అయ్యారు. వైవిథ్యమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కొంత మంది దర్శకులు సోనుసూద్ లో కమెడియన్ ని కూడా హైలై్ట చేసారు. అక్కడా సోనుసూద్ పాస్ అయ్యారు. కామెడీలో తనకంటూ ఓ టైమింగ్ ఉందని నిరూపించారు. హాలీవుడ్ లో `ది లెజెంబ్ ఆఫ్ హెర్క్యూలస్` కి డబ్బింగ్ కూడా చెప్పారు.