స్రవంతి.. వారెవ్వా క్యా లుక్స్ హై!
రీసెంట్ గా వెరైటీ డ్రెస్సుల్లో అలరించిన ముద్దుగుమ్మ.. తాజాగా శారీలో మెరిసింది. ప్లెయిన్ గ్రే కలర్ శారీ, ఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో పిక్స్ దిగింది.
యాంకర్ స్రవంతి చొక్కారపు.. కొద్ది రోజులుగా నెట్టింట ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా సందడి చేస్తోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో ఫోటోలు దిగుతూ అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా వెరైటీ డ్రెస్సుల్లో అలరించిన ముద్దుగుమ్మ.. తాజాగా శారీలో మెరిసింది. ప్లెయిన్ గ్రే కలర్ శారీ, ఫుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో పిక్స్ దిగింది. అదిరిపోయే క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేసింది. లేటెస్ట్ ఫోటోస్ లో అమ్మడు అదిరిపోయింది.
ఔట్ ఫిట్ ఆమెకు పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. తన గ్లోయింగ్ స్కిన్ తో మైమరపిస్తోంది. తన చూపులతో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. నవ్వుతో అనేక మంది హృదయాలను గెలుచుకుంటోంది స్రవంతి. గొడుగు వేసుకుని క్యూట్ గా పోజులిచ్చింది బ్యూటీ. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న స్రవంతి స్టన్నింగ్ పిక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయ్యామని చెబుతున్నారు. అమ్మడు అందాలకు ఎవరైనా ఫ్లాట్ అవ్వడం పక్కా అని అంటున్నారు.
కాగా.. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన స్రవంతి.. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా మారింది. అతి తక్కువ టైమ్ లోనే యాంకర్ గా ఫుల్ పాపులర్ అయింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పలు టీవీ ఛానెళ్లలో వచ్చిన ప్రోగ్రామ్స్ లో సందడి చేసింది. పుష్ప టీమ్ తో చేసిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది. ఆ షోతో తెలుగు వారికి బాగా చేరువైంది.
బిగ్ బాస్ హౌస్ లో తన అందం, ఆటతీరుతో అందరినీ అలరించింది. ఆ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక.. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, మూవీ ప్రమోషన్స్ తో మరింత ఫేమస్ అయ్యింది. గ్లామర్ మెయింటైన్ చేయడంలో అసలు తగ్గని అమ్మడు ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చింది. గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఇప్పుడు ఓవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్.. మరోవైపు ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తూ టాప్ యాంకర్ గా ఇండస్ట్రీలో బిజీబిజీగా గడిపేస్తోంది స్రవంతి చొక్కారపు.