శ్రీలీలపై అలాంటి ఆలోచన విరమించుకోవాల్సిందే!
తాజాగా ఈ అంశంపై అమ్మడు ఓ క్లారిటీ ఇచ్చేసింది. 'ఇప్పుడప్పుడే స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచన లేదు. అలాగని వాటిలో నటించనని కాదు. ఆ పాటలు చేసే సమయం ఇంకా రాలేదు.
శ్రీలీల అంటే అందరికీ గుర్తొచ్చేది అమ్మడు మంచి డాన్సర్ అని. తొలి సినిమాతోనే సొగసరి ఆ ముద్ర వేసేసింది. చిన్న నాటి నుంచే డాన్సర్ కావడంతో ఎలాంటి స్టెప్పులైనా అవలీలగా వేయగల నటి అన్నది అర్దమైంది. డాన్స్ పరంగా చూస్తే సాయి పల్లవి తర్వాత అంతంగా పేరు తెచ్చుకుంది శ్రీలీలనే. నేటి జనరేషన్ హీరోయిన్లు ఎంత మంది వస్తున్నా? డాన్స్ లో స్పార్క్ మాత్రం కొందరికీ సాధ్యం.
అందులో సాయి పల్లవి..శ్రీలీల పోటీ పడతారు. ఇక శ్రీలీలకు తెలుగులో మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. సరిగ్గా ఇది గుర్తించిన త్రివిక్రమ్ 'గుంటూరు కారం'లో అమ్మడితో కుర్చీని ఏ రేంజ్ లో మడత పెట్టించాడో ? తెలిసిందే. ఈ పాటతో మాస్ లోకి మరింత బలంగా వెళ్లింది. అప్పటి నుంచి దర్శకుల ఆలోచన మారింది. శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నా? తీసుకోకపోయినా? అమ్మడితో మాంచి మాస్ నెంబర్ ఒకటి చేయిస్తే చాలా సినిమాకి హైలైట్ అవుతుంది! అన్న ఓ ఐడియా దర్శకులందరిలో మొదలైంది.
ఈ క్రమంలో పలువురు స్టార్ డైరెక్టర్తు సైతం శ్రీలీలను ఆ విధంగా అప్రోచ్ అయ్యారు. కానీ ఎందుకనో సెట్ అవ్వలేదు. తాజాగా ఈ అంశంపై అమ్మడు ఓ క్లారిటీ ఇచ్చేసింది. 'ఇప్పుడప్పుడే స్పెషల్ సాంగ్స్ చేసే ఆలోచన లేదు. అలాగని వాటిలో నటించనని కాదు. ఆ పాటలు చేసే సమయం ఇంకా రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు చేస్తా. ప్రస్తుతం నా దృష్టంతా మంచి పాత్రలు , కథలు ఎంపిక చేసుకోవడంపైనే పెట్టాను.
నా దృష్టిలో స్టార్ అనే కిరీటం రెండు..మూడు సినిమాలతో వస్తుంది అంటే నమ్మను. ఎంతో అనుభవం, ఎన్నై వైవిథ్యమైన పాత్రల్లో నటించనప్పుడు, అవి సక్సెస్ అయినప్పుడు మాత్రమే స్టార్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాను. అంతవరకూ నన్ను స్టార్ అని పిలవాల్సిన పనిలేదు. పిలిచినా సున్నితంగా తిరస్కరిస్తాను' అంది.