నాని, శ్రీకాంత్ ఓదేల.. ఈసారి అంతకుమించి..

ఆయన కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు.

Update: 2024-09-19 06:15 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘దసరా’ మూవీ నిలబడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటిపోయింది. ‘దసరా’ సినిమాలో పెర్ఫార్మెన్స్ కి నాని ఏకంగా సైమా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో నాని నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆయన కెరియర్ లో బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు.


'దసరా' తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాతో సెకండ్ హిట్ నాని అందుకున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ ని కొట్టేశాడు. వరుసగా మూడు హిట్స్ తో జోరు మీద ఉన్న నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. మరో వైపు ‘హిట్ 3’ తర్వాత శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రెండో సినిమా చేయడానికి నాని కమిట్ అయ్యాడు.


‘దసరా’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమా కూడా నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదేల కీలక ప్రకటన చేశారు. 2023 మార్చి 7, నా మొదటి సినిమా దసరాకి లాస్ట్ కట్, లాస్ట్ షాట్ కి షాట్ ఒకే అని చెప్పాను. మరల సెప్టెంబర్ 18న నానితో చేయబోయే నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ వీడియో కోసం యాక్షన్ చెప్పాను.

ఇంతకాలం నా లైఫ్ లో స్పెండ్ చేసిన ప్రతి సెకండ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టాను. ‘దసరా’ కంటే నానితో చేయబోయే నెక్స్ట్ సినిమాని 100 రేట్లు బెస్ట్ గా ఇస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను అని రాసుకొచ్చి, లవ్ సింబల్స్ పెట్టి నాని, SLV సినిమాస్ ని శ్రీకాంత్ ఓదేల తన సోషల్ మీడియా పోస్ట్ లో ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే శ్రీకాంత్ ఓదేల పోస్ట్ బట్టి ఈ సారి నానితో నెక్స్ట్ లెవల్ లో కంటెంట్ ని చెప్పబోతున్నాడనే మాట వినిపిస్తోంది.

ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. ‘దసరా’ తర్వాత నాని వచ్చిన వచ్చిన రెండు సినిమాలు కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. కానీ ‘దసరా’ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు చేస్తోన్న ‘హిట్ 3’ మూవీ బ్రేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ ‘హిట్ 3’ మిస్ అయిన శ్రీకాంత్ ఓదేలతో చేయబోయే ప్రాజెక్ట్ తో మాత్రం ‘దసరా’ కలెక్షన్స్ రికార్డ్ ని నాని బ్రేక్ చేస్తాడని భావిస్తున్నారు.

Tags:    

Similar News