వాళ్లెవరో తెలుసంటూ టైటిల్ లీక్ పై డైరెక్టర్ ఆగ్రహం!
తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ కూడా లీకైన సంగతి తెలిసిందే తాజాగా ఈ లీక్ పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఇండస్ట్రీని పైరసీ, లీకులు బెడద ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంత కఠిన నియమాలు అమలు చేసినా? ఏదో మూల నుంచి లీకు జరుగుతూనే ఉంది. చిన్న చిత్రాల సంగతి పక్కనబెడితే? స్టార్ హీరోల చిత్రాలే టార్గెట్ గా ఎక్కువగా లీక్ అవుతుంటాయి. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాలకే తప్పలేదు లీకులు. ఆ తర్వాత పాన్ ఇండియా చిత్రాలు పుష్ప సహా ఇంకా చాలా సినిమాలు లీకుల బారిన పడ్డవే.
తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ కూడా లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లీక్ పై శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇలాంటి పనులకు పాల్పడిన వారెవరో తనకు తెలుసునన్నారు. తన టీమ్ తో వాళ్లకు సంబంధం లేదని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ` నా సినిమాకే కాదు. ఏ సినిమాకైనా లీకుల బెడద ఉంటే? అసిస్టెంట్ డైరెక్టర్స్, రచయితలను తప్పుబట్టడం మానేస్తే మంచిది.
సినిమాకి సంబంధించి రాబోయే తరం క్రియేటర్స్ వాళ్లంతా. సినిమా రంగానికి వారు అందించే సేవలను ఎప్పుడూ గౌరవించాలి. కష్టపడి పనిచేసే డిపార్ట్ మెంట్లపై నిందలు వేసే అలవాటు మార్చుకోండి. నా సినిమా టైటిల్ ని లీక్ చేసిన వ్యక్తులెవరో నాకు తెలుసు. వాళ్లు నా టీమ్ లోని సభ్యులు కాదు` అని తెలిపారు.
దీంతో తన సినిమా టైటిల్ లీకు వీరులుపై శ్రీకాంత్ కి పూర్తిగా అవగాహన ఉన్నట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఆయన వ్యతిరేక వర్గం ఎవరో ఈ పనిచేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై శ్రీకాంత్ యాక్షన్ తీసుకుంటాడా? ఇక్కడితో వదిలేస్తాడా? మరి ఆ సినిమా టైటిల్ ని కొనసాగిస్తాడా? లేక టైటిల్ మారుస్తాడా? అన్నది తెలియాలి. ప్రస్తుతం ఆ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. `దసరా` తర్వాత నాని-శ్రీకాంత్ కలిసి చేస్తోన్న చిత్రమిది.