స్టైలిష్ గా సలార్ విలనీ..లుక్ ఎలా ఉందంటే?
`సలార్` తో శ్రియారెడ్డి సరైన కంబ్యాక్ దొరికిన సంగతి తెలిసిందే. రాధా రమ పాత్రతో మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించారు.
`సలార్` తో శ్రియారెడ్డి సరైన కంబ్యాక్ దొరికిన సంగతి తెలిసిందే. రాధా రమ పాత్రతో మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించారు. సరైన రోల్ పడితే ఆమె పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందన్నది మరోసారి రుజువు చేసారు. పెళ్లైన తర్వాత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా గతేడాది రెండేళ్ల క్రితమే తిరిగి మ్యాకప్ వేసుకున్నారు. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో సలార్ ఛాన్స్ రావడం..అది రీసెంట్ గా హిట్ అవ్వడంతో మొత్తం జర్నీనే మారిపోయింది.
`సలార్ 2` లో ఆమె పాత్ర ఇంకెంత బలంగా ఉంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తోన్న గ్యాంగ్ స్టర్ చిత్రం ఓజీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వరుసగా అగ్ర హీరోల సినిమాలతో శ్రియారెడ్డి పేరు మారుమ్రోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. ఇన్ స్టాలో కొత్త ఫోటోలతో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.
కేవలం సినిమా ఒక్కటే సరిపోదని భావించి శ్రియా ఇన్ స్టా వంటి మాధ్యమాలతోనూ టచ్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్టైలిష్ గా ముస్తాబైన ఓ ఫోటోని పోస్ట్ చేసారు. అందులో ఆమె జీన్స్..ప్యాంట్ షర్ట్ ధరించారు. చేతులకు తగిలించిన గ్లౌస్ మరింత స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. అలాగే చెవులకు తగిలించిన బుట్టలు అంతే ఆకట్టుకుంటున్నాయి. శ్రియా ని ఈ మొత్తం డిజైన్స్ కొత్త గా ప్రజెంట్ చేస్తన్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత టచ్ లో కి రావడంతో! అభిమాను లంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. శ్రియారెడ్డి హీరో విశాల్ వదిన అన్న సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత కూడా విశాల్ సినిమాలో విలనీ పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ కాంబినేషన్ లో రిలీజ్ అయిన సినిమాలు మంచి విజయం సాధించాయి.