మహేష్ కోసం రాజమౌళి ఎవరిని దించుతున్నాడు..?
సినిమాలో మహేష్ హీరోగా చేస్తున్నా ఇంపార్టెంట్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న
ట్రిపుల్ R తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడని తెలిసిందే. ఈ కాంబినేషన్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. SSMB 29గా రాబోతున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా కోసం రాజమౌళి భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది.
అయితే బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను చూస్తే.. బాహుబలిలో ప్రభాస్, రానాలు నటించారు. హీరో ఒకరు విలన్ ఒకరుగా బాహుబలి రెండు పార్టులను తీశారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఇద్దరు హీరోలను పెట్టాడు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు ఎవరికి వారు అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సినిమాలో కూడా మరో హీరో ఉంటాడన్న వార్త వైరల్ గా మారింది.
సినిమాలో మహేష్ హీరోగా చేస్తున్నా ఇంపార్టెంట్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. అయితే ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మహేష్ సినిమాలో మరో హీరోగా బాలీవుడ్ నుంచి వస్తాడా.. లేదా హాలీవుడ్ హీరో వస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ కోసం రాజమౌళి ఎవరిని దించుతున్నాడు అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
ఈమధ్య జరిగిన యానిమల్ ఈవెంట్ లో రణ్ బీర్ కపూర్ పై రాజమౌళి కామెంట్స్ చూస్తే మహేష్ సినిమాలో నటించే అవకాశం అతనికే ఇస్తాడా అన్న డౌట్ వచ్చింది. మహేష్ రణ్ బీర్ కలిసి చేస్తే మాత్రం SSMB 29వ సినిమా క్రేజ్ కి ఆకాశమే హద్దు అనేలా ఉంటుంది. సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. మహేష్ గుంటూరు కారం రిలీజ్ అవగానే రాజమౌళి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. RRR తో ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ కి తన సత్తా చూపించిన రాజమౌళి మహేష్ సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నాడని తెలుస్తుంది. RRR తో మిస్సైన రికార్డులను ఈ సినిమాతో సాధించాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. మహేష్ తో పాటు ఈ సినిమాలో మరో స్టార్ కూడా ఉన్నాడంటే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.