సహనటుడిని దారుణంగా అవమానించిన స్టార్ హీరో!
ఫలానా హీరో అని అతడు చెప్పకపోయినా కానీ, పలువురు నెటిజనులు ఇష్టానుసారం గెస్ చేస్తూ హీరోలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు.
పరిశ్రమలో ఇన్ సైడర్స్, ఔట్ సైడర్స్ చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఒక ఔట్ సైడర్ తనకు జరిగిన అవమానం గురించి బహిరంగ వేదికపై ఓపెన్ అవ్వడం చర్చగా మారింది. ఒకసారి తన సినిమా షూటింగును సైతం వదులుకుని, వేరొక సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమృత్‌సర్ వరకూ వెళ్లానని, కానీ అక్కడ వేదికపై ఉన్న స్టార్ హీరో తనను వేదిక ఎక్కనివ్వకుండా నిలువరించి తీవ్రంగా అవమానించారని ఆవేదన చెందాడు. పీఆర్వోకు చెప్పి తనను వేదిక ఎక్కనివ్వకుండా చేసాడని తెలిపారు. ఈ విషయాన్ని పాడ్ కాస్ట్ లో చెప్పేప్పుడు అతడి గొంతు లయ తప్పింది. అతడిలో ఆవేదన కనిపించింది. ఆ నటుడు మరెవరో కాదు ఇటీవలే 'స్త్రీ2'తో విజయం అందుకున్న యువహీరో అపర్ శక్తి ఖురానా.
అతడు ఓ సినిమా ప్రమోషన్స్‌లో తాను ఎదుర్కొన్న దయనీయమైన సంఘటనను వివరించారు. తనకు జరిగిన అవమానం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ వేదికపై అగ్ర నటుడి అహంకారం గురించి అతడు ఓపెనయ్యాడు. ప్రస్తుతం ఇది నెటిజనుల్లో పెద్ద చర్చగా మారింది. అపర్‌శక్తి ఖురానాను అవమానించిన స్టార్ హీరో ఎవరు? అంటూ ఇప్పుడు డిబేట్ మొదలైంది. 'జబరియా జోడి'లో సిద్ధార్థ్ మల్హోత్రా, స్ట్రీట్ డ్యాన్సర్‌లో వరుణ్ ధావన్, లుకా చుప్పిలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి పని చేసాడు. పతి పత్నీ ఔర్ వోలోను అతడు నటించాడు. ఇంకా చాలా సినిమాల్లో ఇతర హీరోలతో నటించాడు. కానీ పెద్ద హీరోల్లో మల్హోత్రా, ధావన్, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారు? అంటూ పెద్ద డిబేట్ నడుస్తోంది.
ఫలానా హీరో అని అతడు చెప్పకపోయినా కానీ, పలువురు నెటిజనులు ఇష్టానుసారం గెస్ చేస్తూ హీరోలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అయితే అపర్ శక్తి స్వయంగా పేరు చెప్పనంతవరకూ ఫలానా హీరో అని వేలెత్తి చూపడం అర్థం లేనిది. కచ్ఛితంగా ఫలానా హీరో అని తెలిసినప్పుడు మాత్రమే ఎవరైనా స్పందించాల్సి ఉంటుంది. ఇక కళారంగంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం చాలా రొటీన్. ఇప్పుడు పరిశ్రమను ఏల్తున్న చాలామంది అగ్ర కథానాయకులకు ఇలాంటివన్నీ అనుభవ పాఠాలే. వారు ఎంతో ఒదిగి ఉండడమే గాక, నమ్రతతో తాము అనుకున్నది సాధించుకున్నారు. ఎదగాలంటే ఒదిగి ఉండాలన్న నానుడిని వారు నిజం చేసారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్లకే ఇలాంటి అవమానం ఎదురైంది. కాబట్టి అపర్ శక్తి లాంటి యువహీరో దీనిని పాఠంగా మలుచుకుని ఎదగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.