బరిలోకి దిగిన నయన్, ఖురేషీ, తారా!
తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతుంది. బెంగుళూరులో నాల్గవ షెడ్యూల్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ కాన్వాస్ పై `టాక్సిక్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు...యశ్ లుక్ ప్రతీది అంచనాలు పెంచేస్తుంది. కియారా అద్వాణీ, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది.
తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతుంది. బెంగుళూరులో నాల్గవ షెడ్యూల్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో నయనతార, హ్యూమాఖురేషీ, తారా సుతారియా సెట్స్ లోకి అడుగు పెట్టారట. ముగ్గురిపై కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే వాళ్ల ముగ్గురి మధ్యలో యశ్ ఉన్నాడా? లేడా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే ఇదే షెడ్యూల్ లో యశ్ సహా ప్రధాన తారగణంపై మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం.
నయన్, ఖురేషీ, తార మధ్య వచ్చే ఈ సన్నివేశాలు ఎంతో స్టైలిష్ గా ఉంటాయట. ఇక్కడే మరో క్లారిటీ కూడా వస్తుంది. ఈ సినిమాలో కరీనా కపూర్ కూడా నటిస్తుందనే ప్రచారంలో ఉంది. కానీ హ్యూమా ఖురేషీ ఎంటర్ అయిన నేపథ్యంలో కరీనా చిత్రంలో లేనట్లే కనిపిస్తోంది. వాస్తవానికి కరీనా పేరే ముందుగా తెరపైకి వచ్చింది. కానీ పారితోషికం విషయంలో పొంతన కుదరకపోవడంతో ఆమె తప్పుకుందనే ప్రచారం జరిగింది. తాజాగా ఖురేషీ ఎంట్రీతో అది కన్పమ్ అవుతుంది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది టీమ్. కానీ ఇటీవలే అటవి ఉల్లంఘనకు పాల్పడి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారనే ఆరోపణలతో చట్టపరమైన చర్యలు ఎదుర్కోంటోంది. ఆ కారణంగా షూటింగ్ డిలే అవుతుందని అంటున్నారు. అదే జరిగితే ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయడం కష్టమే.