కీడు తొల‌గించే స్టార్ హీరో బ్రాస్ లెట్ బిహైండ్ స్టోరి

సల్మాన్ ఖాన్ రీల్స్ అనే ఇన్‌స్టా పేజీలో వీడియో ప్ర‌కారం.. ఈ బ్రాస్ లెట్‌ని త‌న తండ్రి ధ‌రించేవాడ‌ని, దానిని త‌న‌కు కానుక‌గా ఇచ్చార‌ని స‌ల్మాన్ చెప్పారు.

Update: 2024-10-19 04:00 GMT

సల్మాన్ ఖాన్ సిగ్నేచర్ బ్రాస్‌లెట్ అభిమానులు ఫ్యాషన్ ఔత్సాహికులను ఎగ్జ‌యిట్ చేస్తుంటుంది. అతడు ఆ బ్రాస్‌లెట్‌ను ఎందుకు ధరించాడనేది రహస్యం కాదు కానీ, అత‌డి ఇమేజ్‌కి పర్యాయపదంగా మారిన అనుబంధం వెనుక ఉన్న కార‌ణం చాలామందికి తెలియదు. అయితే స‌ల్మాన్ బ్రాస్‌లెట్ తెర‌వెన‌క క‌థ‌కు సంబంధించిన‌ పాత వీడియో ఒక‌టి మ‌రోసారి అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారుతోంది. నీలిరంగు మణి రత్నంతో అమర్చిన బ్రాస్‌లెట్‌ను స‌ల్మాన్ ఎందుకు ధరిస్తాడో స‌ల్మాన్ ఒకానొక సంద‌ర్భంలో వెల్లడించాడు.

సల్మాన్ ఖాన్ రీల్స్ అనే ఇన్‌స్టా పేజీలో వీడియో ప్ర‌కారం.. ఈ బ్రాస్ లెట్‌ని త‌న తండ్రి ధ‌రించేవాడ‌ని, దానిని త‌న‌కు కానుక‌గా ఇచ్చార‌ని స‌ల్మాన్ చెప్పారు. దీనిలోని నీలం రంగు రాయిని ఫెరోజా లేదా ట‌ర్కోయిస్ అని పిలుస్తారు. దీనిని జీవం ఉన్న రాయిగా చెబుతారు. నాపై ఉన్న నెగెటివిటీని అడ్డుకుని ప‌గిలిపోతుంది. ఇలా ఇప్ప‌టికి ఏడుసార్లు మార్చాను.. అని వెల్లడించారు.

ఐదు రోజుల క్రితం ఈ వీడియో షేర్ కాగా, పోస్ట్ చేసినప్పటి నుండి దాదాపు 19 ల‌క్ష‌ల (1.9 మిలియన్ల) వీక్షణలను సాధించింది. షేర్‌కు టన్నుల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. క‌ను దిష్ఠి నుంచి నెగెటివిటీ నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌జ‌లు ఎవ‌రికి వారు సెంటిమెంట్ల‌ను అనుసరిస్తున్నారు. స‌ల్మాన్ భాయ్ కూడా దీనిని న‌మ్ముతున్నాడు. అత‌డు త‌న న‌మ్మ‌కం వెన‌క ప్రాక్టికాలిటీని క‌నుగొన్నాడు. స‌ల్మాన్ త‌దుప‌రి మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సికంద‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. మ‌రోవైపు బిగ్ బాస్ షో షూటింగ్ లోను పాల్గొంటున్నాడు. అయితే గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి హ‌త్యా బెదిరింపులు ఎదుర‌వ్వ‌డంతో స‌ల్మాన్ హై అలెర్ట్ గా ఉన్నాడు.

Tags:    

Similar News