మ‌హేష్ చెప్ప‌క‌పోతే సుధీర్ బాబు కి రిస్క్ ర‌స్క్ అయ్యేది!

అయితే తాను ఎలాంటి సినిమా చేసినా దాని గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చ‌ర్చించ‌డం అల‌వాటు.

Update: 2023-10-05 06:14 GMT

యంగ్ హీరో సుధీర్ బాబు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నా! స‌రైన బ్రేక్ మాత్రం ఇంకా రాలేదు. అలాంటి స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్నా అది అంద‌ని ద్రాక్ష‌గానే క‌నిపిస్తుంది. ఎక్కువ‌గా ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉన్న సినిమాలే చేసాడు. కానీ ఎక్క‌డో మిస్ ఫైర్ అవుతుంది. తాను అనుకున్న‌ది మాత్రం జ‌ర‌గ‌డం లేదు. చివ‌రిక బాలీవుడ్ కెళ్లి విల‌న్ గా చేసినా అది అక్క‌డికే ప‌రిమిత‌మైంది. అక్క‌డా బిజీ అయింది లేదు.

దీంతో సుధీర్ బాబు భారీ మార్పులే చేసాడ‌ని తాజాగా ఆయ‌న చేసిన సినిమాని బ‌ట్టి తెలుస్తోంది 'మామా మ‌శ్చింద్ర' అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మూడు ర‌కాల విభిన్న పాత్ర‌లు పోషిస్తు న్నాడు. అందుకోసం చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

ఓ పాత్ర కోసం ఏకంగా 120 కేజీలు బ‌రువు పెర‌గాల‌ని ద‌ర్శ‌కుడు సూచించ‌డంతో అందుకు సుధీర్ బాబు రెడీ అయ్యాడు. అయితే తాను ఎలాంటి సినిమా చేసినా దాని గురించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో చ‌ర్చించ‌డం అల‌వాటు.

ఆలా ఈపాత్ర గురించి..పెర‌గాల్సిన బరువు గురించి మ‌హేష్ కి చెప్పారుట‌. దీంతో ఆయ‌న షాక్ అయి అంత వెయిట్ పెరిగితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి? ఆలోచించు అని చెప్పారుట‌. అలాగే సుదీర్ బాబు స‌న్నిహితులు...స్నేహితులు కూడా మ‌హేష్ లాగే స‌ల‌హా ఇచ్చారుట‌. దీంతో ఆ పాత్ర‌ని ప్రోస్తెటిక్ మ్యాక‌ప్ తో సెట్ చేసిన‌ట్లు రివీల్ చేసారు. అంటే సినిమాలో సుధీర్ బాబు లావుగా క‌నిపించే పాత్ర రియ‌ల్ వెయిట్ కాద‌ని తేలిపోయింది.

ఒక‌వేళ మ‌హేష్ గ‌నుక అలాంటి స‌ల‌హా ఇవ్వ‌క‌పోయి ఉంటే! సుదీర్ బాబు క‌చ్చితంగా రిస్క్ తీసుకునే వాడు. పాత్ర కోసం త‌న‌ని తాను సునాయాసంగా ట్రాన్స‌ప‌ర్ చేసుకోగ‌ల‌డు. గ‌తంలో సిక్స్ ప్యాక్ లుక్ లోనూ అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే సుధీర్ బాబు పాత్ర విష‌యంలో ఎంత క‌మిట్ మెంట్ తో ఉంటాడు అన్న‌ది అర్ధ‌మైంది.

Tags:    

Similar News