మ‌తి చెడ‌గొడుతున్న కింగ్ ఖాన్ న‌ట‌వార‌సురాలు

ఈ వేదిక వ‌ద్ద జెన్ జెడ్ న‌టీమ‌ణులంతా ఒక్కొక్క‌రూ ఒక్కో వెరైటీ డిజైన‌ర్ డ్రెస్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

Update: 2024-12-23 03:41 GMT

శనివారం నాడు ముంబై NMACC ఆర్ట్స్ కేఫ్ లో జ‌రిగిన భారీ ఈవెంట్ కి హిందీ చిత్ర‌సీమ ప్ర‌ముఖులు అటెండ‌యిన సంగ‌తి తెలిసిందే. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వద్ద రెడ్ కార్పెట్ పై ప‌లువురు అందాల‌ భామ‌లు త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించారు. ఈ వేదిక వ‌ద్ద జెన్ జెడ్ న‌టీమ‌ణులంతా ఒక్కొక్క‌రూ ఒక్కో వెరైటీ డిజైన‌ర్ డ్రెస్‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

అర‌డ‌జ‌ను పైగా యువ‌ నాయిక‌లు ఈవెంట్లో మినీ డ్రెస్సుల్లో అందాల్ని ఆర‌బోసారు. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారూఖ్ న‌ట‌వార‌సురాలు సుహానా ఖాన్ త‌న డెబ్యూ సినిమాకి ముందే కుర్ర‌కారు క‌ల‌ల రాణిగా మారుతోంది. నిరంత‌ర ఫోటోషూట్ల‌తో హృద‌యాలను కొల్ల‌గొడుతోంది. తాజాగా అంబానీ క‌ల్చ‌ర్ సెంట‌ర్ లో ఈవెంట్ కోసం సుహానా ధ‌రించిన స్పెష‌ల్ డ్రెస్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

సుహానా ఖాన్ ఎంపిక చేసుకున్న ఈ డ్రెస్ ఏ బ్రాండ్ ? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇది చానెల్ క్రూయిస్ 2024-25 వ‌స్త్ర శ్రేణి నుండి ఎంచుకున్న‌ కో ఆర్డ్ జాకెట్ - స్కర్ట్‌. ప్యారిస్‌లోని ఎమిలీ, ది డెవిల్ వేర్స్ ప్రాడాలను గుర్తుకు తెచ్చే లుక్ ఇది. ఈ డ్రెస్ లో సుహానా హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. ఇక ఇదే వేదిక వ‌ద్ద సుహానా స్నేహితురాలు అనన్య పాండే గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన‌ నలుపు రంగు సీక్విన్డ్ మినీ డ్రెస్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఖుషి, జాన్వీకపూర్ యూనిక్ ఫోటోషూట్లు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

 

Tags:    

Similar News