థై థండర్ షోస్తో గుండెలు మరిగించింది!
తాజా సమాచారం మేరకు సుహానా ప్రఖ్యాత లక్స్ బ్రాండ్ కి సంతకం చేసింది.
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ బాలీవుడ్ లో తొలి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే పాపులర్ బ్రాండ్లు తన వెంట క్యూ కడుతున్నాయి. భారీ కాంట్రాక్టులను కుదుర్చుకుంటున్నాయి. తాజా సమాచారం మేరకు సుహానా ప్రఖ్యాత లక్స్ బ్రాండ్ కి సంతకం చేసింది.
తన తండ్రి అడుగుజాడల్లో బాలీవుడ్ రాయల్టీ షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట కుమార్తె సుహానా ఖాన్ లక్స్ 100 ఇయర్స్ ఈవెంట్లో అబ్బురపరిచింది. ఇటీవలే ఈ బ్రాండ్ తమ కొత్త అంబాసిడర్గా సుహానా పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా సుహానా పబ్లిక్ అప్పియరెన్స్ గుండెల్ని మరిగించింది. ముఖ్యంగా పర్పుల్ కలర్ గౌనుతో రెడ్ కార్పెట్ పై హొయలు పోయింది ఈ కుర్రబ్యూటీ.
సుహానా తీరైన రూపం.. డార్క్ బ్లూ కలర్ ఫిగర్-హగ్గింగ్ సిల్హౌట్ డ్రెస్ సుహానా లో హాట్ నెస్ ని మరింత పెంచాయి.
సుహానా మేకప్ కూడా ఎంతో సింపుల్ గా ఉంది. ఇందులో ఐలైనర్, మెరిసే ఐషాడో, బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్ ఆకర్షిస్తున్నాయి. లక్స్ బ్రాండ్ అంబాసిడర్గా సుహానా అరంగేట్రం కెరీర్లో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ముందుంది ముసళ్ల పండగ అనే సిగ్నల్స్ కూడా ఇస్తోంది.
నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `ది ఆర్చీస్`లో అద్భుత నటనతో ఆకట్టుకుంది సుహానా. ఇక పెద్ద తెర ఆరంగేట్రానికి సుహానా ఎంతో పకడ్భందీ వ్యూహం రచించారని తెలుస్తోంది. షారూక్ తో కలిసి ఒక యాక్షన్ చిత్రంలో సుహానా నటించనుందని కథనాలొస్తున్నాయి. తాజా ఫోటోషూట్ లో పర్ఫెక్ట్ ఫిట్ లుక్ హైలైట్ అయింది. సుహానా థై సొగసుల ఎలివేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగుల ప్రపంచంలో ఫ్లెక్సిబిలిటీ పెద్ద ప్లస్. సుహానాకు వర్థమాన తారగా మంచి భవిష్యత్ ఉందని అంచనా వేస్తున్నారు.