అంబాజీపేటకు సూపర్ బజ్.. సుహాస్ గోల్డెన్ ఛాన్స్

అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. కంటెంట్ ఆకట్టుకునేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Update: 2024-01-29 11:15 GMT

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఆ మూవీలో తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు. నేచురల్ స్టార్ నాని తర్వాత మళ్లీ ఆ స్థాయిలో తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక కలర్ ఫోటో తర్వాత హీరోగా నటిస్తూనే మరోవైపు కమెడియన్గా నవ్వులు పూయించారు. అడవి శేష్ నటించిన హిట్ 2 లో సుహాస్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో.. మరో నాలుగు రోజుల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ సరసన శివానీ నాగారం హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. రెండు మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ట్రెండింగ్ నెం.1 లో నిలిచింది.

అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. కంటెంట్ ఆకట్టుకునేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సుహాస్ మరోసారి ఈ సినిమాతో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించడం గ్యారెంటీగా కనిపిస్తోందని అంటున్నారు. విజువల్స్ రిచ్ గా ఉన్నాయని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అట్రాక్ట్ చేస్తుందని చెబుతున్నారు. మొత్తంగా సినిమా కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ మూవీపై సినీ ప్రియుల దృష్టంతా పడేలా మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్ షోస్ తర్వాత పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే థియేటర్లకు సినీ ప్రియులు క్యూ కడతారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ట్రైల‌ర్ ప్రకారం.. మ్యూజిక్ బ్యాండ్‌ ను న‌మ్ముకుని బ‌తుకుతున్న సుహాస్ ఆ ఊరిలో ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చిన అన్నింటిని తనమీద వేసుకుని బతుకుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా అత‌డు ల‌క్ష్మి అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డుతాడు. ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది? అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అక్క‌ కోసం సుహాస్ ఏం చేశాడు? అనేది ఈ సినిమా స్టోరీ. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


Tags:    

Similar News